
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇకపై రాష్ట్రాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు జాతీ య హోదా ఇవ్వడం కుదరదని, ఆ విధానం ఇప్పు డు అమలులో లేద ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గురువారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ సలీం సాగునీ టి ప్రాజెక్టులపై అడిగిన ఓ అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయం చెప్పారు. ఈశా న్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాల్లో నిర్మించే ప్రాజెక్టులకు 90% నిధులు కేంద్రం ఇస్తుందన్నా రు. కరువు ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం 60% వాటా భరిస్తుందని తెలిపారు.
టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ లేఖ
గడ్కరీ ప్రకటనపై స్పందిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మంత్రికి లేఖ రాశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినట్టుగానే, అదే చట్టం ద్వారా తెలంగాణ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికిగానీ జాతీయ హోదా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. జాతీయ హోదా ఇచ్చే విధానం అమలుపై పునఃపరిశీలన చేయాలని కోరారు
Comments
Please login to add a commentAdd a comment