సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి గడ్కరీ గతంలో రాష్ట్రానికి ప్రకటించిన పలు జాతీయ రహదారుల నిర్మాణంలో తీవ్ర తాత్సారం చేస్తున్నారన్నారు. జాతీయ రహదారుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన సగటు గుర్తింపునివ్వడం లేదన్నారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ అనేక సార్లు గడ్కరీకి లేఖ రాశారని చెప్పారు. కేసీఆర్ చొరవతో 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అనేక రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. హైదరాబాద్‌కు 50 కి.మీ దూరంలో జాతీయ రహదారులను కలిపేలా రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిన కేంద్రం తెలంగాణలో ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించక పోతే వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిరసన వ్యక్తం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment