Centre Gives Clarity Over National Status To Telangana Kaleshwaram Project - Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం

Published Thu, Jul 21 2022 4:53 PM | Last Updated on Thu, Jul 21 2022 10:10 PM

No National Status For Kaleshwaram Project says: Centre - Sakshi

న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్‌ 2016, 2018లో ప్రధానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానం ఇచ్చారు.

ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అన్నారు. జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలని, హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు.

చదవండి: హైదరాబాద్‌ మెట్రోలో డ్యాన్స్‌.. యువతికి షాకిచ్చిన అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement