‘ప్రాణహిత’ పై టాస్క్‌ఫోర్సు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావు
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల పథకానికి జాతీయ హోదా సాధించడానికి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. వీలైనంత తొందరగా జాతీయహోదా లభించేలా ఈ బృందం కృషి చేస్తుందన్నారు. ఆదివారం వుంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయున వూట్లాడారు. భూగర్భ జల మట్టాన్ని పెంపొందించేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తామని, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
సభాగౌరవాన్ని పెంచే విధంగా శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. సభ జరిగే రోజుల్లో ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యేలా చూస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావును పలువురు మంత్రులు, శాసనసభ్యులు కలసి అభినందించారు.