నేటి సభలో తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్.. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం
జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం.. ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు
ఐటీఐఆర్.. పునర్విభజన చట్టంలోని అంశాల అమలుకు హామీలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు శనివారం తుక్కుగూడ జన జాతర సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. మంత్రి, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ ఖరారు చేసిన ఈ ప్రత్యేక హామీలను సీఎం రేవంత్‌రెడ్డి తుక్కుగూడ సభ వేదికపై ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ ఇవ్వనున్న ప్రత్యేక హామీలివే..!
1) ఐటీఐఆర్ ఏర్పాటు
2) ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం.. కాజీపేట్ రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్–వి జయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు.
3) భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషో త్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం.
4) పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా.
5) హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం
6) కొత్త విమానాశ్రయాల నిర్మాణం
7) రామగుండం, మణుగూరు రైల్వేలైన్
8) కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
9) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పెంపు
10) నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
11) నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు
12) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్‌ఈఆర్)
13) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ఫారిన్ ట్రేడ్
14) నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ
15) ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) క్యాంపస్
16) అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా కేంద్రం
17) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు
18) ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ యూనిట్
19) ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్)
20) అంతర్జాతీయ స్థాయి కల్చరల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్
21) మేడారం జాతరకు జాతీయ హోద
22) న్యూ డ్రైపోర్టు ఏర్పాటు
23) హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment