రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయహోదాను సాధించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా అని..
సాక్షి, హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయహోదాను సాధించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందా అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టుగా టీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ నేతలకు తగిన సమయంలో ప్రజలే బుద్దిచెప్తారని హెచ్చరించారు. శ్రీధర్‌బాబు అరెస్టు అప్రజాస్వామికమన్నారు. జాతీయహోదా సాధించడం చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై పోలీసులతో దాడులు చేయించడం దారుణమని పొంగులేటి అన్నారు.