టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఎంపిక విషయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత...
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఎంపిక విషయంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఈ భూమి మీద ఉన్న అత్యంత మూర్ఖుడని పాల్వాయి వ్యాఖ్యానించారు.
ఉత్తమ్ నియామకం భేష్ అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని అభిప్రాయపడ్డారు. రాహుల్ మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని గతంలో కొందరు మధ్యవర్తులు పక్కదోవ పట్టించి నష్టం చేశారన్నారు. ఇపుడు కూడా కొందరు ఇదే తరహాలో రాహుల్‌కు మధ్యవర్తులుగా ఉండి ఆయన్ను పక్కదోవ పట్టిస్తూ, పార్టీకి నష్టం చేస్తున్నారని పాల్వాయి వివరించారు.