కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు దక్కవు: కోమటిరెడ్డి
నల్లగొండ: తమకు టిక్కెట్ రాకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా దక్కవని సాక్షి టెలివిజన్ తో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తన సోదరునికి సిట్టింగ్ సీటు కోరడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై విషప్రచారం చేస్తున్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పాల్వాయి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారని సాక్షితో కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమకు టిక్కెట్లు ఇస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వెళతానని కొంత మంది తమపై విషప్రచారం చేస్తున్నారని, అయితే తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.