
'దోబూచులాడుతున్న చంద్రబాబు, కేసీఆర్'
నల్లగొండ: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు బలిపశువు చేశారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు, కేసీఆర్ దోబూచులాతున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.