
'నరేంద్ర మోడీ రాముడై వస్తున్నాడు'
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రావణ జాతికి చెందిన కాంగ్రెస్ ను ఓడించడానికి మోడీ రాముడై వస్తున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్.కుమార్ తెలిపారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎదుర్కొవడానికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ ను ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. పాల్వాయి సహా ఇతర కాంగ్రెస్ నేతలు తమ చరిత్రను గుర్తించుకుంటే మంచిదన్నారు.
నరేంద్ర మోడీని రాక్షస జాతికి చెందిన వ్యక్తిగా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాక్షస జాతి మోడీతో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేస్తారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.