'ఆ రెండు చోట్ల కూడా టీఆర్‌ఎస్సే గెలవవచ్చు'
హైదరాబాద్: ప్రాణహిత- చేవెళ్ల రీ డిజైన్ పేరుతో.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చి వేల కోట్లు పెంచడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విలేరులతో మాట్లాడారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులోని 28 ప్యాకేజీలకు కొత్త టెండర్లు పిలవకుండా పాతవాటి అంచానాలకే 50 నుంచి 80 శాతం పెంచడంలో అవినీతి ఉందని పాల్వాయి విమర్శించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్ గెలిచిందని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలను జీహెచ్‌ఎంసీతో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అవకతవకలతో ఖమ్మం, వరంగ్‌ల్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్సే గెలవవచ్చునని చెప్పారు. అయినంతమాత్రాన టీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ ఉన్నట్లు కాదని ఎంపీ పాల్వాయి తెలిపారు.