
'జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలోకి టీఆర్ఎస్'
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిలో టీఆర్ఎస్ పార్టీ చేరుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎంపీ, కూతురు కవిత మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని చెప్పారు.
హైదరాబాద్‌లో గురువారం పాల్వాయి విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరుపుతున్నదని, ఈ విచారణ నుంచి బయటపడేందుకు ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని పాల్వాయి విమర్శించారు.