
కరీంనగర్ లో 252 ఫ్లోరైడ్ ప్రాంతాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లాలో 252 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఐఎంఐఎస్(ఇంటిగ్రేటెడ్ మ్యానేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం)ద్వారా 2012-13లో సేకరించిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలో 252 ప్రాంతాల్లోని తాగునీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. అయితే తాగునీటి సరఫరా అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని తెలిపారు.