13 మంది సంతకాలు ఉపసంహరించుకున్నారు
ఈ వాస్తవాల గురించి ప్రస్తావించకుండా కేవ లం నాణేనికి ఒకవైపు ప్రచురించిన సదరు ఆంగ్ల పత్రిక... నీతి, నిజాయితీలకు మారుపేరైన జస్టిస్ నాగా ర్జునరెడ్డి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిందని విమర్శిం చారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆ పత్రిక ఈ విధం గా అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం సరికా దన్నారు. ఇదే విషయాన్ని తాను ఆ పత్రిక యాజమాన్యం దృష్టికి రాతపూర్వకంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. జస్టిస్ నాగార్జునరెడ్డిపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ చేసిన అరోపణలన్నింటినీ కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత వాస్తవాలను తెలుసుకుని పలువురు సభ్యులు తమ సంతకాలను ఉపసంహరించుకుంటున్నట్లు రాజ్యసభ చైర్మన్‌కు తెలిపారని, అయితే ఈ పత్రిక ఈ విషయాన్ని ఎక్కడా కూడా తన కథనంలో పేర్కొనలేదని తెలిపారు. ఇది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పత్రిక వ్యవహరించాల్సిన తీరు ఎంత మాత్రం కాదని విమర్శించారు. నిరాధారంగా, పక్షపాతంతో, ఓ నిర్దిష్ట ఎజెండాతో ఈ కథనం ప్రచురించారన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ను సంప్రదించి ఉంటే వాస్తవాలు తెలిసి ఉండేవని ఆయన తెలిపారు.