
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ప్రమాణ స్వీకరం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డికి గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ నాగుపల్లి శ్రీకాంత్, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment