
సమైక్యరాష్ట్రమే కావాలనడం మూర్ఖత్వం: పాల్వాయి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వెనక్కి తగ్గదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల‌్వాయి గోవర్థన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వెనక్కి తగ్గదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల‌్వాయి గోవర్థన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని అన్నారు. సమైక్య ఉద్యమం ఎన్నిరోజులు జరిగినా ఫలితం ఉండదని, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ వాస్తవాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. ఇంకా సమైక్యరాష్ట్రమే కావాలనడం మూర్ఖత్వమని మండిపడ్డారు.
ప్రభుత్వపాలన ఇలాగే స్థంభిస్తే గవర్నర్ పాలన విధించి కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తుందని అన్నారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ యూటీ(కేంద్రపాలిత ప్రాంతం) చేయరని చెప్పారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రే ఎక్కువ అభివృద్ది చెందుతుందని అన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు వాస్తవాలను ప్రజలకు వివరించి విభజనకు సహకరించాలని పాల‌్వాయి గోవర్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.