'ఆ నలుగురి' వద్దే అధికారం
హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్టపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని అధికారమంతా కేసీఆర్ కుటుంబంలోని నలుగురు ప్రజాప్రతినిధులదే అని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో దిగ్విజయ్సింగ్తో పాల్వాయి భేటీ అయ్యారు. అనంతరం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ దీటుగా ఎదుర్కోలేక పోతుందన్నారు.
ప్రతిపక్ష నేత జానారెడ్డిలో పోరాడే తత్వం లేదని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ పోరాట తత్వంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తీరు మార్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి హితవు పలికారు. లేదంటే ప్రభుత్వం విఫలం కాక తప్పదన్నారు.
ప్రభుత్వ పాలన ఇలానే సాగితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని ప్రజలు రాళ్లతో కొడతారని పాల్వాయి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. తీరు మార్చుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి హితవు పలికారు. లేదంటే ప్రభుత్వం విఫలం కాక తప్పదన్నారు. ప్రభుత్వ పాలన ఇలానే సాగితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని ప్రజలు రాళ్లతో కొడతారని పాల్వాయి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.