T Cong MP
-
నాలుక కోస్తా అన్న కేసీఆర్.. మరి ఇప్పుడు..
కాంగ్రెస్ ఓటమికి పాల్వాయి వంటి నేతలే కారణం మండలి ప్రతిపక్ష నేత షబ్బిర్ అలీ హైదరాబాద్ : కాంగ్రెస్ ఓటమికి ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... సీఎల్పీ నేత జానారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యలను షబ్బీర్ అలీ ఖండించారు. జానారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన పాల్వాయికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన కోరారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, కూలీల వలసలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్‌ను సైతం కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తాము రెండేళ్లుగా చెబుతున్న అంశాలే జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ లేవనెత్తారని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో కోదండరాంను విమర్శించినందుకు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నాలుక కోస్తా అన్న కెసీఆర్.. ఇప్పుడు తెలంగాణ మంత్రులు కోదండరాం పై చేసిన దాడిని ఏ విధంగా స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులకు ఏ శిక్షలు విధిస్తారని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. ఈ అంశంపై కేసీఆర్ స్పందించకపోతే ఆయన ఆదేశాలతోనే మంత్రులు కోదండరామ్‌ను టార్గెట్ చేశారని భావించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. -
కేసీఆర్ నీ కొడుకును అదుపులో పెట్టుకో: వీహెచ్
ఖమ్మం: 'నీ కొడుకును అదుపులో పెట్టుకో' అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) సూచించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీహెచ్ విలేకర్లలో మాట్లాడుతూ.... కాంగ్రెస్‌ను బొంద పెడతాం, అడ్రస్ లేకుండా చేస్తామని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయే అని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే మంత్రి కేటీఆర్ లండన్‌కు పరిమితం అయ్యేవాడని ఎద్దేవా చేశారు. పాలేరులో ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని వీహెచ్ చెప్పారు. -
'ఆ విషయం కేసీఆర్‌కూ తెలుసు'
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని రాజ్యసభ సభ్యుడు వీహెచ్ తెలిపారు. ఆ విషయం టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ తెలుసునని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలసి వీహెచ్... సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ...మూడు సార్లు రాజ్యసభకు పంపినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. కాంగ్రెస్ త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని ఆయన తెలిపారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని వీహెచ్ ఈ సందర్బంగా చెప్పారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామన్నారు. -
'గవర్నర్ వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు'
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... గవర్నరు ప్రతీ రోజూ దేవాలయాలకు తిరగడం వల్ల రహదారిపై ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత ఇష్టాలతో వీఐపీలు.... సామాన్యులకు ఆటంకం కలిగించడం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీల కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణం చాలా ఆశ్చర్యకరంగా, సామాన్య ప్రజలు నవ్వుకునే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. పంతుళ్లు రాజకీయ పార్టీలకు అనుకూలంగా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. పంచాంగ శ్రవణం అంటే వర్షాలు పడుతాయా, ప్రజలకు ఏడాది ఎలా ఉంటుందో, భవిష్యత్తులో జరిగే మంచిచెడుల గురించి చెప్పాలని వీహెచ్ సూచించారు. రాజకీయపార్టీల భవిష్యత్తు ఎక్కడైనా పంచాగంలో ఉంటుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురౌతున్న వరుస ఓటములకు కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్తులో పార్టీ పటిష్టత కోసం ఏం చేయాలనే దానిపై లోతుగా చర్చించుకోవాల్సిందేనని వీహెచ్ అభిప్రాయపడ్డారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షునికి, సీఎల్పీ నేతకు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్‌కు లేఖలు రాసినా స్పందన లేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
'మీ రెండు సీట్లతో తెలంగాణ సాధ్యమయ్యేదా?'
నల్గొండ : టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో గుత్తా విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వొద్దని హుడ్కోకు తాను లేఖ రాయలేదని స్పష్టం చేశారు. ఎస్టిమేషన్ సరిగ్గా లేదని... ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని మాత్రమే తాను లేఖ రాసినట్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని... కేసీఆర్ అప్పుల ఊబిగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో మిషన్ భగీరథకు కానీ... డబుల్ బెడ్రూమ్ కానీ పైసా కేటాయించలేదని గుత్తా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని గుత్తా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కానీ... అభివృద్ధి ముసుగులో అవినీతికి... అలాగే తెలంగాణ ముసుగులో ఆంధ్ర పాలన సాగిస్తున్న దానికే వ్యతిరేకమని గుత్తా పేర్కొన్నారు. అయితే మిషన్ భగీరథకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఎస్టిమేషన్లో మాత్రం తప్పు ఉందని... వాటిని పరిశీలించి లోన్ ఇవ్వాలని మాత్రం హుడ్కో కి రాసిన లేఖలో పేర్కొన్నానని చెప్పారు. అలాగే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి స్థానాలు 2 మాత్రమే ఉన్నాయి. ఆనాడు టీ కాంగ్రెస్ ఎంపీలంతా ఒక్కటిగా ఉండి.. పార్టీ అధిష్టానానికి ఇబ్బంది అయినా పార్లమెంట్లో తెలంగాణ పక్షాన పోరాడి.. ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చామని తెలిపారు. అలా వచ్చిన రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటామా అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. పార్లమెంట్లో మా గళం,మా మద్దతు లేకపోతే మీ రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయేదా! అసలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక పోతే తెరాస పార్టీ ఎక్కడిది...మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడివి అంటూ పాలక టీఆర్ఎస్ కి ప్రశ్నలు సంధించారు. బంగారు తెలంగాణ కోసం ,అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 ఎన్నికలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణ చేసి ప్రజలపై లేని భారం వేస్తున్నారని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర పాలనా ముసుగులో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పరిపాలన టీఆర్ఎస్ సాగిస్తుందని దీనిని ఖండిస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
'టీఆర్ఎస్ ఓవర్‌లోడ్ అయింది'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతల చేరికతో టీఆర్ఎస్ పార్టీ ఓవర్‌లోడ్ అయిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో వి.హనుమంతరావు మాట్లాడుతూ... టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నేతలను అక్కడ సెకండ్ సిటిజన్లుగానే పరిగణిస్తారన్నారు. గౌరవం లేని చోటుకు ఎందుకు వెళ్లడమంటూ టీఆర్ఎస్ కండువా కప్పుకున్న టీడీపీ నేతలను వి.హనుమంతరావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని టీడీపీ నేతలకు వి.హనుమంతరావు ఉచిత సలహా ఇచ్చారు. -
'టీఆర్ఎస్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త మంత్రిత్వ శాఖ'
నల్గొండ : అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ అనే కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఆ శాఖ బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. శుక్రవారం నల్గొండలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌పై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చేశామని చెబుతున్న టీఆర్ఎస్... ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలను కలుపుకుని పోతామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా
నల్గొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండలో స్పందించారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని ఆయన ఆరోపించారు.టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా ఈ సందర్భంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. అలాగే అవసరమైతే టీడీపీతో కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపు మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోవ స్థానంలో ఉండగా.... , బీజేపీ - టీడీపీ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డిపై విధంగా స్పందించారు. -
'సుబ్రహ్మణ్య స్వామి బ్లాక్ మెయిలర్'
హైదరాబాద్ : బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ శుక్రవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్యస్వామి బ్లాక్ మెయిలర్, శాడిస్టు అని వీహెచ్ అభివర్ణించారు. డిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దిక్కుతోచని బీజేపీ నేతలు రాహుల్‌కు బ్రిటీష్ పౌరసత్వం ఉందని.. కమీషన్ ఏజెంట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు దాడి చేస్తాయనే స్వామి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను మేథావినంటూ వ్యవహరిస్తున్న స్వామికి ఎప్పుడో ఒకప్పుడు తగిన శాస్తి జరుగుతుందన్నారు. మోదీ, ఆరెస్సెస్ మెప్పు కోసమే సుబ్రహ్మణ్యస్వామి అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు. విచారణ జరుపుకోవాలన్న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన సవాల్‌ను స్వీకరించాలని మోదీని వీహెచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
'కేసీఆర్ ఎందుకు మాట తప్పారో చెప్పాలి'
నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. మాట తప్పితే తల నరుక్కుంటానని చెబుతున్న కేసీఆర్... దళిత సీఎం, మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్ల విషయంలో ఎందుకు మాట తప్పారో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు. -
కేసుల మాఫీ కోసమేనా చండీయాగం ?
నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలియుగం నుంచి ద్వాపర, త్రేతాయుగాలకు తీసుకెళ్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మొన్నటిదాకా ఉత్సవాలు, పండగలంటూ ఆర్భాటం చేసి, ఇప్పుడేమో చండీయాగం అంటున్నారని పేర్కొన్నారు. గురువారం నల్లగొండలో గుత్తా సుఖేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వ్యక్తిగత ఇష్టాల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయటం బాధాకరమని ఆయన అన్నారు. సహారా, ఈఎస్ఐ కేసుల్లో సీబీఐ దర్యాప్తు నుంచి బయట పడటానికేనా చండీయాగం అని కేసీఆర్‌ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో కాలువల షట్టర్లను మూసివేసి సాగర్ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నీరు అవసరమైతే షట్టర్లు ఎత్తుకోవాలని గుత్తా ప్రజలకు సూచించారు. జిల్లా మంత్రి చెప్పినా సాగర్ అధికారులు మాట వినటం లేదని అంతా అనుకుంటున్నారని... అలాంటప్పుడు సదరు మంత్రి ఎందుకని ఎంపీ గుత్తా నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా కేసీఆర్...ఈఎస్ఐ భవనాల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన అని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. -
'పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారు'
నల్గొండ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం నల్లొండలో నిప్పులు చెరిగారు. మొన్నటి వరకు తిట్టుకున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు. కేసీఆర్, చంద్రబాబులు ఇరు రాష్ట్ర ప్రజలకు భారంగా మారారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు పట్టించుకోకుండా పండగల పేరుతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. బతుకమ్మ పేరుతో కేసీఆర్ రూ. 100 కోట్లు దుబారా చేశారన్నారు. బతుకమ్మ ఉత్సవాలను పలు ప్రభుత్వ శాఖలపై బలవంతంగా రుద్దారని కేసీఆర్‌పై గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. -
'ఆ నలుగురి' వద్దే అధికారం
హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దుష్టపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని అధికారమంతా కేసీఆర్ కుటుంబంలోని నలుగురు ప్రజాప్రతినిధులదే అని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో దిగ్విజయ్‌సింగ్‌తో పాల్వాయి భేటీ అయ్యారు. అనంతరం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ దీటుగా ఎదుర్కోలేక పోతుందన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డిలో పోరాడే తత్వం లేదని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ పోరాట తత్వంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తీరు మార్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు పలికారు. లేదంటే ప్రభుత్వం విఫలం కాక తప్పదన్నారు. ప్రభుత్వ పాలన ఇలానే సాగితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని ప్రజలు రాళ్లతో కొడతారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. తీరు మార్చుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హితవు పలికారు. లేదంటే ప్రభుత్వం విఫలం కాక తప్పదన్నారు. ప్రభుత్వ పాలన ఇలానే సాగితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరిని ప్రజలు రాళ్లతో కొడతారని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. -
బీజేపీ అవినీతిపై ప్రచారం చేస్తాం
హైదరాబాద్ : బీజేపీ ప్రచారానికి దీటుగా తాము కూడా బీజేపీ అవినీతిపై ప్రచారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాలరాసినట్లుగా ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలను చేపట్టడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని ఆయన బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యాపం, లలిత్‌మోడీ కేసుల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల అవినీతిపై పార్లమెంట్లో తమ పార్టీ నిలదీస్తే అప్రజాస్వామ్యమని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు. కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ఏపీకీ ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాలని తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని తాను కోరినట్లు వి.హనుమంతరావు ఈ సందర్భంగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలకు హామీలిచ్చి మోసం చేశాయంటూ బీజేపీ, టీడీపీపై వి.హనుమంతరావు నిప్పులు చెరిగారు.