'టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతల చేరికతో టీఆర్ఎస్ పార్టీ ఓవర్లోడ్ అయిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో వి.హనుమంతరావు మాట్లాడుతూ... టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నేతలను అక్కడ సెకండ్ సిటిజన్లుగానే పరిగణిస్తారన్నారు.
గౌరవం లేని చోటుకు ఎందుకు వెళ్లడమంటూ టీఆర్ఎస్ కండువా కప్పుకున్న టీడీపీ నేతలను వి.హనుమంతరావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని టీడీపీ నేతలకు వి.హనుమంతరావు ఉచిత సలహా ఇచ్చారు.