హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిశుపాలుడుకి మించి తప్పులు చేశారని కాంగ్రెస్ ఎంపి పాల్వాయి గోవర్ధన రెడ్డి ఆరోపించారు. సీఎం భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. అధిష్టానం ఆయనను డిస్మిస్ చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు.
మంత్రి మండలి ఆమోదంలేకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఆ నివేదికను కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) పరిగణలోకి తీసుకోరాదని ఆయన కోరారు. టీడీపీ ఎంపీకి దుమ్ముగూడెం టెండర్లను ఖరారు చేయాలనుకుంటున్నారన్నారు.