
బూడిద తెలంగాణగా మారుస్తున్నారు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ పాల్వాయి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ అడ్డగోలు విధానాలతో బూడిద తెలంగాణగా మారుస్తున్నారని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కోదండరాంను ఒంటరివాడిని చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకపోవడం వల్ల యూజీసీ నిధులు రావడం లేదని, దీంతో వర్సిటీలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రాజెక్టు రీడిజైన్‌ల పేరుతో పెంచిన నిధులలో సీఎం కేసీఆర్‌కు ఎన్ని ముడుపులు ముడుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.