న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం పదిన్నర సమయంలో ఇరువురు ప్రమాణం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇరువురు బీజేపీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ సంస్కృతంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమిత్ షా... పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాగా అమిత్ షా, స్మృతి ఇరానీ ..రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే.