డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు  | Navaneethakrishnan Removed From AIADMK Post After Attend DMK Wedding | Sakshi
Sakshi News home page

Navaneethakrishnan: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు 

Published Sat, Jan 29 2022 1:58 PM | Last Updated on Sat, Jan 29 2022 5:05 PM

Navaneethakrishnan Removed From AIADMK Post After Attend DMK Wedding - Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే ప్రచార కార్యదర్శి, ఎంపీ కె.ఎస్‌.ఇళంగోవన్, నళిని దంపతుల కుమార్తె ధరణి వివాహానికి హాజరైన ఆరోపణలపై అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్‌పై ఆ పార్టీ వేటు వేసింది. అన్నాఅరివాలయంలోని కలైంజర్‌ ఆడిటోరియంలో గురువారం పెళ్లి జరగ్గా ఎంపీ నవనీతకృష్ణన్‌ హాజరు కావడమేకాక, సీఎం స్టాలిన్‌ను కలిసి అభినందనలు తెలపడం వివాదాస్పదమైంది. దీంతో అన్నాడీఎంకే సమన్వయకమిటీ కన్వీనర్‌ ఓ.పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌  ఎడపాడి,  నవనీతకృష్ణన్‌ను కమశిక్షణ చర్యగా  పార్టీ లీగల్‌సెల్‌ కార్యదర్శి పదవి నుంచి తప్పించినట్లు శుక్రవారం ప్రకటించారు. 
చదవండి: రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement