Navaneethakrishnan
-
డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు
సాక్షి, చెన్నై: డీఎంకే ప్రచార కార్యదర్శి, ఎంపీ కె.ఎస్.ఇళంగోవన్, నళిని దంపతుల కుమార్తె ధరణి వివాహానికి హాజరైన ఆరోపణలపై అన్నాడీఎంకే ఎంపీ నవనీతకృష్ణన్‌పై ఆ పార్టీ వేటు వేసింది. అన్నాఅరివాలయంలోని కలైంజర్ ఆడిటోరియంలో గురువారం పెళ్లి జరగ్గా ఎంపీ నవనీతకృష్ణన్ హాజరు కావడమేకాక, సీఎం స్టాలిన్‌ను కలిసి అభినందనలు తెలపడం వివాదాస్పదమైంది. దీంతో అన్నాడీఎంకే సమన్వయకమిటీ కన్వీనర్ ఓ.పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి, నవనీతకృష్ణన్ను కమశిక్షణ చర్యగా పార్టీ లీగల్‌సెల్ కార్యదర్శి పదవి నుంచి తప్పించినట్లు శుక్రవారం ప్రకటించారు. చదవండి: రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం கழக ஒருங்கிணைப்பாளர் திரு. ஓ. பன்னீர்செல்வம், கழக இணை ஒருங்கிணைப்பாளர் திரு. எடப்பாடி கே. பழனிசாமி ஆகியோரின் முக்கிய அறிவிப்பு. pic.twitter.com/GoaHfpRkPA — AIADMK (@AIADMKOfficial) January 28, 2022 -
ఏకగ్రీవం!
సాక్షి, చెన్నై: రాజ్యసభకు నవనీత కృష్ణన్ ఎంపిక ఏకగ్రీవం కానున్నది. ప్రధాన పార్టీలు నామినేషన్లు దాఖలు చేయని దృష్ట్యా, ఇక ఆయన ఎంపిక లాంఛనం అయింది. శ్మశానాల్లో షెడ్డుల నిర్మాణంలో అవకతవకలు డీఎంకే ఎంపీ సెల్వగణపతి మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే కేబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన తప్పుకు ఇటీవల జైలు శిక్ష పడింది. అన్నాడీఎంకే గూటి నుంచి డీఎంకే పక్షాన చేరిన ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవిని దక్కించుకున్నారు. జైలు శిక్షతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఈ సీటు భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 16 నుంచి నామినేషన్లను స్వీకరిస్తూ వచ్చారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా టీఎన్పీఎస్సీ చైర్మన్ నవనీత కృష్ణన్‌ను సీఎం జయలలిత ప్రకటించారు. రాజ్యసభ సీటుతోపాటుగా పార్టీ న్యాయవాద విభాగం కార్యదర్శి పదవి సైతం నవనీత కృష్ణన్‌ను వరించింది. ఏకగ్రీవం : తన అభ్యర్థిత్వాన్ని సీఎం జయలలిత ఖరారు చేయడంతో ఆమె ఆశీస్సులు, మంత్రులతో కలసి నవనీత కృష్ణన్ నామినేషన్ సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పది మంది ఎమ్మెల్యేలు బల పరిచారు. ఈ సీటు తమది కావడంతో అభ్యర్థిని డీఎంకే నిలబెట్టొచ్చన్న ప్రచారం సాగింది. అయితే, ఆ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యా బలం తక్కువగా ఉన్నందున, ఆ పార్టీ అభ్యర్థి బరిలో దిగేనా అన్న ప్రశ్న బయలు దేరింది. లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోని ఆ పార్టీ, మరో ఓటమిని ఎదుర్కొనేందుకు సిద్ధంగాలేదని చెప్పవచ్చు. అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే తరపున అభ్యర్థి నామినేషన్ వేస్తారన్న సంకేతాలు ఉన్నా, ఆ పార్టీ నేత విజయకాంత్ సాహసించ లేదు. నవ నీత కృష్ణన్‌తో పాటుగా మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే, ఆ నలుగురికి ఎమ్మెల్యేల మద్దతు లేని దృష్ట్యా, నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం తథ్యం. ఇక నామినేషన్ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల తరపున అన్నాడీఎంకే అభ్యర్థి నవనీత కృష్ణన్ నామినేషన్ మాత్రం పరిగణనలోకి తీసుకున్నారు. మిగిలిన పార్టీలు నామినేషన్లు సమర్పించని దృష్ట్యా, రాజ్య సభ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవం కానున్నారు. ఇక ఆయన ఎన్నిక లాంఛనం కానున్నది. ఆయన ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడబోతున్నది. -
నవనీతకృష్ణన్ నామినేషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: వచ్చేనెల 3 వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఏ నవనీత కృష్ణన్ సోమవారం తన నామినేషన్‌ను దాఖలు చేశా రు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటరాగా చెన్నైలోని సచివాలయంలో మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల అధికారి జమాలుద్దీన్‌కు నవనీత కృష్ణన్ తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సీఎం జయలలితతోపాటు పదిమంది ఎమ్మెల్యేలు ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) చైర్మన్‌గా ఉన్న నవనీతకృష్ణన్ అన్నాడీఎంకే తరపున రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. డీఎంకే రాజ్యసభ సభ్యుడు సెల్వగణపతి అవినీతి ఆరోపణలు, శిక్ష కారణంగా రాజీనామా చేసి వైదొలగాల్సి వచ్చింది. దీంతో తమిళనాడులో ఒక ఖాళీ ఏర్పడింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, 118 ఓట్లు దక్కించుకున్నవారే రాజ్యసభకు ఎంపికవుతారు. అన్నాడీఎంకేకు 153 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు అండగా నిలుస్తున్నారు. అసెంబ్లీలో అన్ని పార్టీల బలాబలాలను పరిశీలిస్తే సంఖ్యాబలం ప్రకారం అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుస్తోంది. రాజ్యసభకు రాజీనామా చేసిన సెల్వగణపతికి 2016 జూన్ 29 వ తేదీ వరకు గడువు ఉన్నందున అప్పటి వరకు నవనీతకృష్ణన్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఈనెల 16 నుంచి 23 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదీన పరిశీలన, 26వ తేదీన ఉపసంహరణ పూర్తిచేసి జూలై 3న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నికల రాజుగా పేరొందిన పద్మరాజన్ ఎప్పటి వలెనే తన నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన నామినేషన్ల సంఖ్య 161కి చేరుకుంది. అలాగే పీఎన్ రామచంద్రన్ అనే వ్యక్తి సైతం వరుసగా 15వ నామినేషన్ దాఖలు చేశారు. వీరిద్దరి నామినేషన్లను ఎమ్మెల్యేలు ఎవరూ ప్రతిపాదించని కారణంగా చెల్లనివిగా మిగిలిపోయి నవనీత్కృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అన్నాడీఎంకే న్యాయసలహాదారుగా ఉన్న మనోజ్పాండియన్ను తప్పించి, ఆ పదవికి నవనీత కృష్ణన్‌ను నియమిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, సీఎం జయలలిత సోమవారం ప్రకటించారు.