
రాజ్యసభకు మళ్లీ పోటీ చేయను: ఏచూరి
రాజ్యసభ ఎంపీగా మరోమారు ఎన్నిక కావాలని కోరుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా మరోమారు ఎన్నిక కావాలని కోరుకోవడం లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. వరుసగా రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆయన పదవీకాలం వచ్చే ఆగస్టులో పూర్తికానుంది.
ఒక వ్యక్తి రెండు కన్నా ఎక్కువ సార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యేందుకు పార్టీ నియమాలు అనుమతించవని, ‘ఇది మా పార్టీ నియమం. మూడోసారి నేను పోటీ చేయను’ అని తెలిపారు. ఏచూరి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు లెఫ్ట్ పార్టీ వర్గాలు తెలిపాయి.