
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ కార్యకలాపాలను ఫోన్‌లో చిత్రిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్‌రావ్ పాటిల్‌ను సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలయ్యే దాకా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎంపీలపై ఆయన చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా విపక్ష సభ్యుల నిరసనను పాటిల్ వీడియో తీశారు. ఆమెను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ధన్‌ఖడ్ అన్ని పార్టీల నేతల అభిప్రాయం కోరారు. ఆమెపై చర్య తీసుకునే ముందు విచారణ జరిపితే బాగుంటుందని వారన్నారు.