
రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతితో ఆయన భేటీ అవుతారని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
రాజ్యసభ చైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు విజయసాయి రెడ్డి అంతకుముందు మీడియాతో చెప్పారు. రాజ్యసభలో తాను లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన చైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు గత మూడు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. న్యాయం చేయాలని గట్టిగా నినదిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.