ఏపీ ప్రజలకు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి | Ayodhya Rami Reddy Says Thanks YS Jagan | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజలకు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి

Published Mon, Mar 9 2020 7:31 PM | Last Updated on Mon, Mar 9 2020 7:37 PM

Ayodhya Rami Reddy Says Thanks YS Jagan - Sakshi

సాక్షి, గుంటూరు : తనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచినందుకు ఆనందంగా ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర వాణి వినిపిస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి సీఎం వైఎస్‌ జగన్‌ అవకాశం కల్పించారని అన్నారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలోనే వైఎస్‌ జగన్‌ కూడా నడుస్తున్నాని చెప్పారు. 

కాగా, రాజ్యసభ ఎన్నికలకు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ పరిమల్‌ నత్వాని పేర్లను ప్రకటించింది.

చదవండి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement