అవనిగడ్డలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పర్యటన | MP Ayodhya Rami Reddy MLC Marri Rajasekhar visits Avanigadda | Sakshi
Sakshi News home page

అవనిగడ్డలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పర్యటన

Published Mon, Oct 30 2023 6:42 PM | Last Updated on Mon, Oct 30 2023 7:26 PM

MP Ayodhya Rami Reddy MLC Marri Rajasekhar visits Avanigadda - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సోమవారం పర్యటించారు. సామాజిక సాధికార బస్ యాత్ర ఏర్పాట్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధమైన డయాలసిస్ కేంద్రాన్ని  ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరిశీలించారు. కాగా నవంబర్ 2న అవనిగడ్డలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.

ఈ సందర్భంగా ళ్ల అయ్యోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. నాలుగేళ్ళలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 85 శాతం మందికి వారి అవసరాలు తీర్చామని చెప్పారు. ఆయా వర్గాల జీవన విధానం మెరుగు పడిందన్నారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్‌సీపీ శ్రేణులు, లబ్ధిదారులు వేడుకలా జరుపుకునే వాతావరణం ఏర్పడిందని తెలిపారు.

బస్సు యాత్ర రూట్‌లో అన్ని వర్గాల వారిని కలుస్తామని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ది ద్వారా కలిగిన సంతోషాన్ని పంచుకునే కార్యక్రమం సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్ధిక, సామాజిక సాధికారతకు సీఎం జగన్ పరిపాలన దోహదపడిందని తెలిపాఉ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement