Marri raja shekar
-
హైడ్రా ఎఫెక్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేజీలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీంతో, కాలేజీలను కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫోకస్ పెట్టడంతో పలువురు అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటితోపాటు దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించినందుకు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు ఆక్రమించారని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని.. లేకపోతే మేమే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో వెల్లడించారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్స్, షెడ్స్, వెహికిల్ పార్కింగ్తో పాటు కాలేజీ రోడ్లు వేశారని రెవెన్యూ అధికారులు తెలిపారు. దీంతో, మరోసారి హైడ్రా కూల్చివేతల అంశంలో హాట్ టాపిక్ మారింది.మరోవైపు.. హైకోర్టులో దాఖలైన పిటిషన్లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని 13 చెరువుల్లో కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కలెక్టర్.. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. ఇదిలా ఉండగా.. నగరంలో ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘ఒవైసీ, మల్లారెడ్డి అనేది చూడం. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తాం. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చు. ఎఫ్టీఎల్ అనేది ముఖ్యమైన అంశమే, దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తాం. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయి. ధర్మసత్రమైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటున్నారు. పలు అక్రమ నిర్మాణాలపై దృష్టిసారిస్తున్నారు. ఇక, హైడ్రా ఆఫీసుకు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కూడా సెక్యూరిటీని పెంచారు. -
అవనిగడ్డలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పర్యటన
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సోమవారం పర్యటించారు. సామాజిక సాధికార బస్ యాత్ర ఏర్పాట్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధమైన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరిశీలించారు. కాగా నవంబర్ 2న అవనిగడ్డలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ళ్ల అయ్యోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. నాలుగేళ్ళలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 85 శాతం మందికి వారి అవసరాలు తీర్చామని చెప్పారు. ఆయా వర్గాల జీవన విధానం మెరుగు పడిందన్నారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులు, లబ్ధిదారులు వేడుకలా జరుపుకునే వాతావరణం ఏర్పడిందని తెలిపారు. బస్సు యాత్ర రూట్లో అన్ని వర్గాల వారిని కలుస్తామని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ది ద్వారా కలిగిన సంతోషాన్ని పంచుకునే కార్యక్రమం సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్ధిక, సామాజిక సాధికారతకు సీఎం జగన్ పరిపాలన దోహదపడిందని తెలిపాఉ. -
మంత్రి ప్రత్తిపాటి అండతో పేకాట క్లబ్‌లు
చిలకలూరిపేట టౌన్: జిల్లాలోని చిలకలూరిపేటలో పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కోతముక్క నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ ఆరోపించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దల కాలక్షేపం కోసం నిర్మించిన సీఆర్ రిక్రియేషన్ క్లబ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి, గురజాల క్లబ్‌లను మూయించి, పేటలో పేకాట నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు రూ.2 కోట్లకుపైగా కోత ముక్కాటలో చేతులు మారుతున్నాయని, దీంతో క్లబ్‌కి రూ.2 లక్షలకుపైగా ఆదాయం లభిస్తుందని తెలిపారు. నల్లధనానని తెల్లధనంగా మార్చుకునేందుకు మంత్రి స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసి క్లబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవల పేరుతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతంలో కరెంట్ బిల్లు చెల్లిండానికే క్లబ్‌కి ఆదాయం ఉండేది కాదని, నేడు ఏటా రూ.10 కోట్ల విరాళాలు ఇచ్చేలా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారనివిమర్శించారు. మద్యం దుకాణాలు, జాదం నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో వైద్య శిబిరాలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్న జాదరులు మంత్రి అండతో యథేచ్ఛగా ఆడుతున్నారని పేచర్కొన్నారు. క్లబ్ ఆదాయ వనరులు, వాటి వివరాల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీఎం సుభాని ఉన్నారు. -
ప్రభుత్వ తాత్సారంతోనే హోదా వెనుకడుగు
పట్నంబజారు(గుంటూరు) : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీధి నాటకాలు ఆడుతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలు శనివారం ముగిశాయి. వైఎస్పార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ హాజరై విద్యార్థులకు నిమ్మరసాన్ని తాగించి దీక్షలు విరమింపచేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఆనాడు పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసి పునర్విభజనలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ తాత్సారంతోనే హోదా వెనుకడుగు పడుతుందన్న విషయం ప్రజలకు అర్ధమైందన్నారు. టీడీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేయాలి.. అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా రోడెక్కి ఆందోళన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేవలం ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బందులు తలెత్తితే కేంద్రం సర్దిచెబుతుందనే అంశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ హోదా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి మాట్లాడుతూ నేడు విద్యార్థులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా విద్యార్థి సంఘాల నేతలకు రుణపడి ఉంటామన్నారు. నేడు జిల్లాలో చేపట్టిన దీక్షను రాష్ట్రస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈనెల 26వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పలు విభాగాల నేతలు ఆతుకూరి ఆంజనేయులు, కావటి మనోహర్‌నాయుడు, కొత్తాచినప్పరెడ్డి, 13 జిల్లాల జేఏసీ ప్రతినిధులు లీలామోహన్, మర్రి వేముల శ్రీనివాస్, టి.సూర్యం, వెంకటరెడ్డి, కోటేశ్వరరావు, కుర్రా శ్రీనివాసరావు, చిన నాగేంద్రం, ఆదినారాయణ, రాజేష్, అంజి, నాగరాజు, వంశీ, మంత్రునాయక్, భూక్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలం
గుంటూరు వెస్ట్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎన్నికల్లో హామీలిచ్చిన టీడీపీ నాయకులు ఆ హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము కోరుతుంటే, తమ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. రాష్ట్రానికి హోదా తెచ్చే విషయంలో తమ పార్టీ శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించడంలేదంటూ తమ అధినేత జగన్‌పై టీడీపీ నాయకులు అభాండాలు మోపడం సరికాదన్నారు. చంద్రబాబు కేసులకు భయపడే ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీని నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని బీజేపీ నేతలకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీసీఐ కుంభకోణంలో సీబీఐని అడ్డుకుంటున్న మంత్రి పుల్లారావు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ను విజయవంతం చేసిన ప్రజలకు, సహకరించిన వామపక్షాలు, ఎమ్మార్పీఎస్, వాణిజ్యరంగాల వారికి రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకోబోం.. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 30 వంచనకు, విద్రోహానికి గురైన రోజుగా రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ గుర్తుంచుకుంటారన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రాష్ర్ట రైతులకు, మహిళలకు, కార్మికులకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో తాము చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రాష్ర్ట ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. రాజకీయ జ్ఞానంలేని రావెల.. రాజకీయ జ్ఞానంలేని మంత్రి రావెల కిశోర్‌బాబు తమ పార్టీ అధినేతపై అవగాహనారాహిత్యంగా మాట్లాడటం, అసత్యప్రచారం చేయడం సబబుకాదని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రిషితేశ్వరి కేసులో నిందితుడైన ప్రిన్సిపాల్ బాబూరావును టీడీపీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రత్యేక హోదా, భూసేకరణ తదితర అంశాల్లో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కె.చిన్నప్పరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు, వివిధ విభాగాల నాయకులు ఆవుల సుందర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, ఉప్పుటూరి నర్సిరెడ్డి, యాజలి జోజిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మారెడ్డి ఎన్నిక లాంఛనమే !
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నిక లాంఛనమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో కేవలం జిల్లా నుంచి ఉమ్మారెడ్డి, మరో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి నామినేషన్ ధాఖలు చేశారన్నారు. వైఎస్సార్సీపీకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల మద్దతు 570కి పైగా ఉందని తెలిపారు. దీనితో ఏకగ్రీవం తథ్యమని, ఎన్నిక పక్రియ లాంఛనంగా జరుగుతుందని తెలిపారు. అపార అనుభవం ఉన్న రాజకీయ భీష్ముడు ఉమ్మారెడ్డి ఎన్నికవడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమైనట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు రావి వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున,పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డి అనుభవం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పార్టీ నేతలు ఉమ్మారెడ్డికి పుష్ఫగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. మిఠాయిలు పంపిణీ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), సంయుక్త కార్యదర్శి చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొగిలి మధు, కిలారి రోశయ్య, డైమండ్‌బాబు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నా మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకి' అంటూ ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లాలోని తెనాలి వైఎస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఆదివారం మహబూబ్ బాషా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుందని, 80 శాతం మంది ప్రజలు చంద్రబాబును దోషిగా పేర్కొంటున్నారని మర్రి రాజశేఖర్ తెలిపారు. -
3న రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూములను కోరిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చి 3న రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మర్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయం మేరకే రాజధాని గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారని చెప్పారు. రైతులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వాధికారులు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజస్వామ్యంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం సమంజసమా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇది ప్రజస్వామ్యమా? లేక రాజరికమా? అంటూ మండిపడ్డారు. రైతాంగానికి వైఎస్ఆర్ సీపీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల కోసం ప్రాణాలిస్తున్న చంద్రబాబు ఇప్పుడు రైతుల ప్రాణాలు తీస్తున్నారని విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, కౌలురైతుల తరపున మహోద్యమం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి, ఆర్కే, మర్రి రాజశేఖర్‌లు తెలిపారు.