మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
కంకిపాడు: వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార నినాదం గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మార్మోగింది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు అక్కచెల్లెమ్మలు, యువత, అవ్వాతాతలు జేజేలు పలికారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు.
బాబు, పవన్‌ను తరిమికొట్టండి
దొంగలకు, చంద్రబాబు, పవన్‌లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. వీరిద్దరూ పిక్‌పాకెటర్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో అసమానతలు
జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా, అన్నీ అసమానతలు, అవమానాలు, వెలివేతలే మిగిలాయన్నారు.
టీడీపీలో ముస్లింలకు స్థానమేది?
ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. వారికి కనీస గుర్తింపు కూడా మృగ్యమేనన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ముస్లింకు అయినా మంత్రి పదవి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పాలన అంతా చంద్రబాబు దోపిడీని సాగిస్తే.. జగనన్న సామాజిక న్యాయంతో అణగారిన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు.
విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతి..
సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని, సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులే కాదని, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమే అని చాటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, సామినేని ఉదయభాను, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ చైర్‌పర్సన్ తాతినేని పద్మావతి, డీసీఎంఎస్ చైర్‌పర్సన్ పడమట స్నిగ్ధ, నియోజకవర్గ పరిశీలకులు బొప్పన భవకుమార్, మంగళగిరి పార్టీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, కమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్‌లు తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment