గుంటూరు, సాక్షి: ఏపీలో అరాచక పరిస్థితులు దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెబుతున్నారు. శనివారం తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులు జరుగుతున్నాయి. టీడీపీ దాడులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించాం. టీడీపీ దాడులపై పార్లమెంట్‌లో లేవనెత్తాలని జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు పార్లమెంట్‌లోనూ మేం పోరాడతాం. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిలను కలుస్తాం. ఇక్కడి పరిస్థితులు దేశమంతా తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం.
ఇలాంటి దాడులు సరికాదు.. పైగా ప్రజాస్వామ్యానికి ముప్పు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంది. చంద్రబాబు తక్షణం ఈ దాడులు ఆపాలి. ప్రజలకు మంచి చేసేలా పాలన కొనసాగాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment