
'నరసరావుపేట దెబ్బ ఏంటో చూపిద్దాం'
నరసరావుపేట(గుంటూరు జిల్లా): వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్ బాటలో నడుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్నాడు పౌరుషం ఏంటో చూపిద్దామని పిలుపునిచ్చారు. నరసరావుపేట దెబ్బ ఎలావుంటుందో చూపించాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలరని చెప్పారు. జగన్ నాయకత్వంలో నడిచి వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేయాలని అయోధ్యరామిరెడ్డి కోరారు.