narasaraopeta
-
పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం
-
Narasaraopeta: చిన్నతురకపాలెం ప్రత్యేకత ఏంటో తెలుసా?
సాక్షి, నరసరావుపేట: పూర్వీకుల ఊరి పేరు అడిగితే ఎవరైనా చెప్పడానికి కాస్త తడుముకుంటారు. కానీ ఆ గ్రామంలో ఇంటి పేరు ముందు ఊరిపేరు పెట్టుకుంటారు. పూర్వీకులను నిత్యం తలచుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని చినతురకపాలెం ప్రత్యేకత ఇది. ఎందుకలా.. ఏమా కథా.. కమామిషు.. అంటే.. వందల ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారంతా కలసి ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చినతురకపాలెం అని పేరు పెట్టుకున్నారు. అందరూ ముస్లింలే. రోజులు గడిచేకొద్దీ పేర్లన్నీ ఒకేలా ఉండడంతో పిలవడంలో గందరగోళం తలెత్తింది. దీంతో ఇంటిపేరు ముందు గానీ, తర్వాత గానీ ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఊరిపేరు చేర్చడం అలవాటు చేశారు అప్పటి పెద్దలు.. ఉదాహరణకు షేక్ సలాముద్దీన్ అనే వ్యక్తి మధిర నుంచి వచ్చినవాడనుకోండి. షేక్ ముందో తర్వాతో మధిర పేరును కలిపారు. అలా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 750 కుటుంబాలు ఉండగా, 550కుపైగా కుటుంబాలు తమ ఇంటిపేరు ముందో తర్వాతో పూర్వీకుల ఊరిపేరు చేర్చుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డుల్లోనూ ఇవే పేర్లను నమోదు చేయిస్తుండడం విశేషం. ఇప్పుడు పుట్టే బిడ్డలకూ ఈ సంప్రదాయం కొనసాగిస్తుండడం గమనార్హం. ఇరవై ఊళ్ల నుంచి వలసలు ఈ గ్రామంలో పొదిలి, చావపాటి, పెట్లూరివారిపాలెం, కూరపాడు, ముప్పాళ్ళ, అనంతవరప్పాడు, గురిజేపల్లి, మధిర, చిరుమామిళ్ళ, తూబాడు వంటి అనేక గ్రామాల నుంచి వలసలు వచ్చిన వారు ఉన్నారు. ఇలా ఇక్కడ ఇరవై ఊళ్ల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. (క్లిక్: జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!) ఆనవాయితీగా వస్తోంది మా పేర్లకు ముందు ఇంటి పేరుతోపాటు పూర్వీకుల గ్రామం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మేమూ కొనసాగిస్తున్నాం. మాకు పుట్టే బిడ్డలకూ అన్ని గుర్తింపు కార్డుల్లోనూ ఇదే తరహాలో నమోదు చేయిస్తున్నాం. – షేక్ పొదిలే ఖాజా మొహిద్దీన్, చిన్న తురకపాలెం గ్రామస్తుడు సౌలభ్యం కోసం... ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండడంతో ఊరుపేర్లతో పిలవడం మొదలెట్టారు. మేమంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారం కావడంతో ఖాజా, సైదా, మస్తాన్‌వలి వంటి పేర్లు ఎక్కువగా పెడుతుంటాం. అందుకే ఇంటి పేరు ముందు పూర్వీకుల ఊరి పేరు పెట్టి పిలవడం మొదలెట్టారు. అదే కొనసాగుతోంది. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా మాకు మాత్రం సౌలభ్యంగా ఉంది. – పెట్లూరివారిపాలెం మహబూబ్ సుభానీ, చిన్నతురకపాలెం గ్రామస్తుడు -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ తెలుగు యువత నాయకుడు
నరసరావుపేట రూరల్: పేకాట శిబిరం నిర్వహిస్తూ తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ నరసరావుపేట రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.76,500ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చినట్టు రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ కొంతకాలంగా పట్టణ శివారు సత్తెనపల్లిరోడ్డు సాయినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ జూద స్థావరం నిర్వహిస్తున్న మారుతీతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా మారుతీ జూదాన్ని వృత్తిగా ఎంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ మారుతీ పట్టుబడడంతో అతనిపై నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేటల నుంచి టీడీపీ నాయకులు మారుతీ ఆధ్వర్యంలో నిర్వహించే జూద శిబిరంలో పాల్గొనే వారని సమాచారం. -
నరసరావుపేటలో బహిరంగ సభ
-
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: ఆదిమూలపు
-
బస్సు యాత్ర స్పందన చూసి చంద్రబాబుకు వణుకు: సీదిరి అప్పలరాజు
-
సామాజిక న్యాయం ఘనత సీఎం జగన్‌దే: రాజన్నదొర
-
వారిని వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది: జోగి రమేష్
-
సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
-
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమం కోరుకునే నాయకుడు సీఎం జగన్: విడదల రజిని
-
లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు: మంత్రి ధర్మాన
-
జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
సింగిల్‌గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తాం: అంజాద్ బాషా
-
చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దు: మంత్రి మేరుగ
-
మహానాడు కాదు.. ఏడుపునాడు.. నరసరావుపేట సభలో మంత్రులు
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు: మంత్రి అంబటి టీడీపీ మహానాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనన్నారు. బడుగు, బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్. బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనే. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదు. టీడీపీది మహానాడు కాదు.. ఏడుపునాడు మాత్రమేనని’’ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దు: మంత్రి మేరుగ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నడైనా సాయం చేశారా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు చేశారన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో సుపరిపాలన జరుగుతోందన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దని ప్రజలకు మంత్రి మేరుగ నాగార్జున విజ్ఞప్తి చేశారు. సింగిల్‌గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తాం: అంజాద్ బాషా అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి అంజాద్ బాషా అన్నారు. కేబినెట్లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తామని అంజాద్ బాషా అన్నారు. జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు: మంత్రి వేణుగోపాలకృష్ణ సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. సామాజిక విప్లవకారుడిగా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు నినాదం కావాలని మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు: మంత్రి ధర్మాన బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రతి లబ్ధిదారు ఇంటికి సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయి. మూడేళ్లలోనే 90 శాతంపైగా హామీలను సీఎం జగన్ నెరవేర్చారన్నారు. నాడు-నేడు ద్వారా గ్రామాల్లో పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామన్నారు. సమాజంలో అంతరాలు తగ్గించేలా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయి ఫ్రస్టేషన్లో చంద్రబాబు: విడదల రజిని టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముంచారని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోరుకునే నాయకుడు సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, సామాజిక విప్లవం నడుస్తోందన్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయి చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నారని విడదల రజిని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలకు రాజకీయం అవకాశం కల్పించిన నాయకుడు సీఎం జగన్. ఆయన నాయకత్వాన్ని బలపర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వారిని వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది: జోగి రమేష్ బలహీన వర్గాలను వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కూడా అంతుచూస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఓడిస్తానంటున్న లోకేష్.. ముందు ఎమ్మెల్యేగా గెలవాలని హితవు పలికారు. బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి కట్టుగా ఉన్నారన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. పొత్తులు పెట్టుకున్నా, పొర్లు దండాలు పెట్టినా చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. సామాజిక న్యాయం ఘనత సీఎం జగన్‌దే: రాజన్నదొర వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం తథ్యమని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. సీఎం జగన్‌కు మనమంతా అండగా నిలబడాలన్నారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. బస్సు యాత్ర స్పందన చూసి చంద్రబాబుకు వణుకు: సీదిరి అప్పలరాజు బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు వణుకు పుట్టిందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల క్షేమం కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. దళితులను ఘోరంగా అవమానించిన చరిత్ర చంద్రబాబుదని.. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన: ఆదిమూలపు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలిస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టీడీపీ హయాంలో బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు. టీడీపీ హయాంలో గిరిజన, మైనారిటీ శాఖలకు మంత్రులు కూడా లేని పరిస్థితి అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. -
గంజాయి స్మగ్లింగ్ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు
నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి, దుండిగల్ (హైదరాబాద్): గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితురాలు, పరారీలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. 2013లో నమోదైన ఈ కేసులో జాహ్నవిపై హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నరసరావుపేటలో అరెస్టు చేసి తరలించారు. కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ దొరకడంతో పరార్.. జాహ్నవి కొన్నేళ్ల క్రితంవరకు హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో ఉండేది. 2013లో ఆమె విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి గంజాయిని అక్రమంగా తరలించేందుకు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సురేశ్‌రెడ్డి, కిషోర్ గంజాయిని తరలిస్తుండగా సూరారం చౌరస్తా వద్ద దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాహ్నవి పరారు కావడంతో ఎల్బీనగర్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లాయర్నని చెప్పుకుంటూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు జాహ్నవిపై ఆరోపణలున్నాయి. దిక్కుతోచని టీడీపీ నేతలు.. గంజాయి అక్రమ రవాణా కేసులో మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించినా కక్ష సాధింపు అంటూ నిత్యం గగ్గోలు పెట్టే టీడీపీ నాయకులకు ఈసారి ఏం మాట్లాడాలో దిక్కు తోచడం లేదు. చివరకు జాహ్నవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ బచ్చుల అర్జునుడు ప్రకటించారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చి నిజానిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
700 కి.మీ. ప్రయాణించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వంద పడకల ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ కాన్పు అయిన మహిళా కూలీని ప్రసవానంతరం సుమారు 350 కిలోమీటర్ల దూరంలోని ఆమె సొంత గ్రామానికి తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా వదిలి పెట్టి వచ్చిన ఘటన ఇది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నేలతలమర్ర గ్రామం నుంచి గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో మిరపకాయలు కోసేందుకు జె.యశోద తన భర్తతో కలిసి వచ్చింది. నిండు గర్భిణిగా ఉన్న ఆమెకు నొప్పులు రావడంతో 108 ద్వారా నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి డాక్టర్లు సురక్షితంగా ఆమెకు సాధారణ కాన్పు చేయగా బిడ్డను ప్రసవించింది. మూడు రోజుల అనంతరం వైద్యశాల నుంచి బిడ్డతో సహా ఆమెను సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత గ్రామానికి తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉచితంగా తీసుకెళ్లి వదిలి పెట్టి వచ్చారు. దీనిద్వారా తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ రానూపోను 700 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇలాంటి సర్వీసును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (AP: రెండేళ్లు రిటైర్మెంట్లు లేవు) -
నరసరావుపేటలో జాషువా విగ్రహావిష్కరణ
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ప్రభుత్వాస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన గుర్రం జాషువా కాంస్య విగ్రహాన్ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. జాషువా మనవడు బీఆర్ సుశీల్‌కుమార్ దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను బడుగు, బలహీన వర్గాలకు దగ్గర చేయాలనే లక్ష్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ చేపట్టారన్నారు. పల్నాడులో పుట్టి విశ్వకవిగా ఎదిగిన జాషువా చిరస్మరణీయుడని కొనియాడారు. ఎమ్మెల్సీ డొక్కా మాట్లాడుతూ.. జాషువా విగ్రహావిష్కరణతో నరసరావుపేట పట్టణం పునీతమైందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.. జాషువా విదేశాల్లో పుట్టి ఉంటే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చి ఉండేదన్నారు. మాజీ జిల్లా రిజిస్ట్రార్ బాలస్వామి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.సుజాతాపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాంగ్‌రేప్; ఎవరికైనా చెబితే నగ్న వీడియోలు నెట్లో పెడతాం..
సాక్షి, నరసరావుపేట టౌన్: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కృష్ణయ్య మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన ఓ యువతి భర్తతో విభేదాల కారణంగా నరసరావుపేట పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది. తన దగ్గర ఉన్న 47 సవర్ల బంగారాన్ని భద్రపరచమని సుమారు ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రు గ్రామానికి చెందిన గుంజి శ్రీనివాసరావులకు ఇచ్చింది. అయితే బంగారం తిరిగి ఇవ్వకపోవటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసి బంగారం తిరిగి ఇప్పిస్తానని మాజీ రౌడీషీటర్ గుజ్జర్లపూడి ఆనంద్ విజయ్‌కుమార్ అలియాస్ కన్నల్ పోలీస్ స్టేషన్లో ఆరు నెలల కిందట ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసనగర్‌లో ఓ గృహం అద్దెకు తీసుకొని యువతిని అక్కడ ఉంచాడు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, అతని స్నేహితుడు వినుకొండ నియోజకవర్గ ఓ పార్టీ ఇన్చార్జి అట్లూరి విజయకుమార్ కలిసి గృహంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎక్కడైనా చెబితే తమ దగ్గర ఉన్న నగ్నవీడియోలు నెట్లో పెడతామని ఆమెను బెదిరించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై టూటౌన్ పోలీసులు అదే రోజు గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితులిద్దరు పరారై ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కేసులో రెండవ నిందితుడైన అట్లూరి విజయకుమార్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: ‘ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’ -
‘పేట’ జేఎన్టీయూకు శాశ్వత భవనాలు
సాక్షి, అమరావతి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జేఎన్టీయూ క్యాంపస్ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా నరసరావుపేటలో శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఏడాది మరో రూ.40 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వ్యయం చేస్తామని, నరసరావుపేట జేఎన్టీయూ కోసం మొత్తం రూ.120 కోట్లు వెచ్చిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... వెనుకబడ్డ పల్నాడుకు మేలు.. ► నరసరావుపేట జేఎన్టీయూలో 2016లో ఫస్ట్ బ్యాచ్‌లో చేరిన విద్యార్థులు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వం ఏనాడూ చేయలేదు. ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు, ల్యాబుల్లో నడుపుతూ వచ్చారు. ఈ పరిస్థితిని మారుస్తాం. ► వెనుకబడ్డ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలన్నది మా సంకల్పం. చిత్తశుద్ధితో చేపట్టిన ఈ కార్యక్రమమే అందుకు ఉదాహరణ. ► మొన్ననే 1,100 టీచింగ్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. ఆ పోస్టుల్లో నరసరావుపేట జేఎన్టీయూకు చెందినవీ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ల్యాబులు కూడా అందుబాటులోకి తెస్తాం. గత సర్కారు ఐదేళ్లు కాలయాపన గత సర్కారు జేఎన్టీయూ భవనాలు కట్టకుండా ఐదేళ్లు కాలయాపన చేస్తే మీరు (సీఎం జగన్) వచ్చి నిధులిచ్చారు. పీజీ కళాశాల కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాకాని వద్ద నిర్మాణం ► పల్నాడు రోడ్డులో ప్రస్తుతం జేఎన్టీయూను నిర్వహిస్తుండగా నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. ► స్థానిక లింగంగుంట్ల కాలనీ ఎన్ఎస్పీ స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్యశాలను జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. ► సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నరసరావుపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శామ్యూల్, కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘కోడెల’ దోపిడీపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : అధికారం అడ్డంపెట్టుకొని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్ చేసిన దోపిడీపై చర్యలు తీసుకోవాలని పమిడిపాడు గ్రామ మాజీ సర్పంచ్ లాం కోటేశ్వరరావు సోమవారం కోడెల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎండీగా ఉన్న ఎన్సీవీ కార్యాలయాన్ని కోడెల శివరామ్, అతని అనుచరులు గతంలో ధ్వంసం చేసి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కలిగించారన్నారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోక పోగా తమపైనే తప్పుడు కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలకు తెలియజేసేందుకే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గాన్ని, వ్యాపారులను వదలకుండా కేట్యాక్స్ వసూలు చేశారన్నారు. భవన నిర్మాణాలు మొదలపెట్టిన తర్వాత అధికారులచే పనులు నిలిపివేసి యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్నారు. కమ్మ హాస్టల్ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ కళాశాలను అక్రమంగా అద్దెకు ఇచ్చి ప్రతి నెలా లక్షలాది రూపాయలు కోడెల శివరామ్ మెక్కాడన్నారు. చివరకు అన్న క్యాంటీన్ భోజనాలను సైతం కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ కంపెనీలో పనిచేసే కార్మికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు. సొంత సామాజిక వర్గం కూడా చీదరించుకొనేలా కప్పం కట్టించుకొని, చివరకు కోడెల కుటుంబంతో సహా ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. మొదట కోడెల శివరామ్ కట్ చేయించిన కేబుల్ వైర్లను టాక్టర్‌లో తీసుకొచ్చిన లాం కోటేశ్వరరావు మాజీ స్పీకర్ ఇంటి ప్రాంగణంలో వాహనాన్ని అడ్డుగా నిలిపాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో వెళ్లి నచ్చచెప్పటంతో ఆందోళనను విరమించారు. -
కోడెల శిష్యుడు కోర్టులో లొంగుబాటు
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : గుంటూరు జిల్లా, నరసరావుపేటలో స్టేడియం కమిటీ అభివృద్ధి పేరుతో లక్షలాది రూపాయలు గోల్మాల్ చేసిన శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అనుంగు శిష్యుడు, స్టేడియం కమిటీ మాజీ ఇన్చార్జి మందాడి రవి సోమవారం కోర్టులో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియం కమిటీ చైర్మన్‌గా వాస్తవానికి ఆర్డీవో వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, కోడెల అండదండలతో మందాడి రవి అన్నీ తానై అక్రమ వ్యవహారాలను చక్కబెట్టాడు. స్టేడియంలో ఏ కార్యక్రమం చేపట్టినా అనధికారికంగా కే–ట్యాక్స్ వసూలు చేసేవాడు. గడచిన ఐదేళ్లలో స్టేడియం అభివృద్ధి ముసుగులో లక్షలాది రూపాయలను కోడెల కుమారుడు శివరామ్ కమిటీ ఇన్చార్జి రవిని అడ్డం పెట్టుకుని దండుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం మారగానే అప్రమత్తమైన నిందితులు ఎక్కడా ఏ ఆధారం దొరకకుండా సాక్ష్యాలను తారుమారు చేశారు. రాత్రికి రాత్రే తాళాలు పగులగొట్టి రికార్డులను అపహరించుకు పోయారు. దీంతో స్టేడియంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రూ.22 లక్షల దుర్వినియోగం.. స్టేడియంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు గత నాలుగేళ్లలో రూ.22 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో పాటు స్టేడియంలో ఉండాల్సిన విలువైన పైపులు, ఇతర సామగ్రి మందాడి రవి అపహరించుకెళ్లి అమ్ముకున్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ కొల్లా రాజేంద్రరెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చీటింగ్, చోరీ కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న రవి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. అయితే న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం. నిందితుడిని నరసరావుపేట సబ్‌జైలుకు తరలించారు. నేడు సీఎం జగన్‌కు మద్దతుగా మాదిగల ర్యాలీ నెహ్రూనగర్(గుంటూరు): మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి మద్దతుగా గుంటూరులోని నగరంపాలెం నుంచి అసెంబ్లీ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ తెలిపారు. నగరంపాలెంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసెంబ్లీ వరకు చేపట్టిన పాదయాత్రకు వ్యతిరేకంగా ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో నోటాకి ఓటు వేయమని చెప్పిన కృష్ణమాదిగకు.. వైఎస్ జగన్‌ను ప్రశ్నించే హక్కులేదన్నారు. సమావేశంలో మాదిగ మహాసేన నాయకులు ప్రభాకర్, సుబ్బారావు, గోపి, బుజ్జి, రమేష్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మాదిగల అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసూ మంగళవారం మంగళగిరి నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
గుడ్‌మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో ఎమ్మెల్యే గొపిరెడ్డి
-
నరసారావుపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కన్నా నామినేషన్
-
నరసరావుపేట టీడీపీ అభ్యర్థికి అవమానం
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో అవమానం ఎదురైంది. కోడెలను కలిసేందుకు అరవిందబాబు ఆయన ఇంటికి వెళ్లగా.. కోడెల పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయారు. వివరాలు.. కోడెల వ్యతిరేక వర్గీయుల సహకారంతో అరవిందబాబు చివరి నిమిషంలో అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కోడెల వర్గీయులు పట్టణంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో అరవిందబాబు మంగళవారం బీఫామ్ తీసుకొని ఊరేగింపుగా పట్టణంలోకి ప్రవేశించి తన వైద్యశాల పరిసరాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. (కోడెల వ్యతిరేక వర్గీయులదే పైచేయి) ఈ ప్రచారానికి కోడెల వర్గీయులు దూరంగా ఉన్నారు. దీంతో బుధవారం ఉదయం కోడెలను కలిసి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో అరవిందబాబు కోడెల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కోడెల.. అరవిందబాబును చూసి కూడా పలకరించకుండానే కిందకు దిగి వెళ్లిపోయారు. దీంతో అరవిందబాబు కోడెల తనయుడు శివరామ్‌ను కలిసి తనకు సహకరించాల్సిందిగా కోరారు. శివరామ్ తన వర్గానికి చెందిన పార్టీ నాయకులు నాగసరపు సుబ్బరాయగుప్తా తదితరులను పరిచయం చేశారు. అందరూ తనకు సహకరించాలని అరవిందబాబు వారిని కోరారు. కోడెల ఉండవల్లి వెళ్లారని.. ఆయన వచ్చేదాకా వేచి ఉండాలని శివరాం సూచించడంతో అరవిందబాబు వారి ఇంటిలోని పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. ఎంతసేపు చూసినా కోడెల రాకపోవటంతో చివరకు ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు.