
జాషువా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి ఆదిమూలపు, ఎమ్మెల్సీ డొక్కా, ఎమ్మెల్యే గోపిరెడ్డి. చిత్రంలో జాషువా మనవడు సుశీల్‌కుమార్ (వృత్తంలో)
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ప్రభుత్వాస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన గుర్రం జాషువా కాంస్య విగ్రహాన్ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. జాషువా మనవడు బీఆర్ సుశీల్‌కుమార్ దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను బడుగు, బలహీన వర్గాలకు దగ్గర చేయాలనే లక్ష్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ చేపట్టారన్నారు. పల్నాడులో పుట్టి విశ్వకవిగా ఎదిగిన జాషువా చిరస్మరణీయుడని కొనియాడారు. ఎమ్మెల్సీ డొక్కా మాట్లాడుతూ.. జాషువా విగ్రహావిష్కరణతో నరసరావుపేట పట్టణం పునీతమైందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.. జాషువా విదేశాల్లో పుట్టి ఉంటే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చి ఉండేదన్నారు. మాజీ జిల్లా రిజిస్ట్రార్ బాలస్వామి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.సుజాతాపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment