gurram Joshua
-
జాతి గర్వించదగ్గ వ్యక్తి.. జాషువా
సాక్షి, అమరావతి: కుల వివక్షకు వ్యతిరేకంగా కలమే ఆయుధంగా మలుచుకొని రచనలు చేసిన వ్యక్తి మహాకవి గుర్రం జాషువా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కొనియాడారు. నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన జన్మించడం గుంటూరు జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఆయన జాతి గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సమాజంలో బడుగు, బలహీనవర్గాల వారికి, మహిళలకు సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి జాషువా అని ప్రశంసించారు. ఎక్కడైతే అవమానాలు పొందారో అక్కడే సత్కారాలు పొందారని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గుర్రం జాషువా జాతి గర్వించదగిన కవి అని తెలిపారు. శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గుర్రం జాషువాతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండటం తన అదృష్టమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జాషువా కోరుకున్న విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను సమాజంలో ఓ స్థాయికి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. శాసనమండలిలో విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గుర్రం జాషువా సమసమాజాన్ని ఆశించారని తెలిపారు. ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి, విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నరసరావుపేటలో జాషువా విగ్రహావిష్కరణ
నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో ప్రభుత్వాస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన గుర్రం జాషువా కాంస్య విగ్రహాన్ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. జాషువా మనవడు బీఆర్ సుశీల్‌కుమార్ దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను బడుగు, బలహీన వర్గాలకు దగ్గర చేయాలనే లక్ష్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ చేపట్టారన్నారు. పల్నాడులో పుట్టి విశ్వకవిగా ఎదిగిన జాషువా చిరస్మరణీయుడని కొనియాడారు. ఎమ్మెల్సీ డొక్కా మాట్లాడుతూ.. జాషువా విగ్రహావిష్కరణతో నరసరావుపేట పట్టణం పునీతమైందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.. జాషువా విదేశాల్లో పుట్టి ఉంటే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చి ఉండేదన్నారు. మాజీ జిల్లా రిజిస్ట్రార్ బాలస్వామి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.సుజాతాపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా జాషువా జయంతి
-
ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. భగత్‌సింగ్‌కు నివాళుర్పించిన జగన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మూర్తిదేవికి ‘గబ్బిలాల’ స్వాగతం
తెలుగు సాహిత్యం నిద్రాణం నుంచి జాషువా రాకతో మేలుకున్నది. దాని వేలుపట్టి వెలుగులో నడిపించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్. నేటికి తెలుగు సాహి త్యాన్ని మెరుగులు దిద్దుతూ మరమ్మతు చేస్తున్న వారిలో ప్రథముడాయన. 78 ఏళ్ల ఇనాక్ ఆరు పదుల వర్తమాన సాహిత్య జీవన కవనమై చరిస్తూ, సజీవంగా చలిస్తూ 87 గ్రంథాల సృష్టికర్తగా వర్ధిల్లుతున్నారు. పట్టుకున్న ప్రతీ సాహిత్య ప్రక్రియను పండించటంలో ఎదురులేని కృషీ వలుడు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో వచ్చిన బహుళ సాహిత్య ప్రక్రియల్లో రచనను కొనసాగించి తెలుగు సాహిత్యానికి పరిపుష్టిని చేకూర్చి పరిపూర్ణం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి పెద్ద దిక్కుగా గమనం చూపిస్తూ నడుస్తున్న చరిత్రగా ప్రయాణం చేస్తున్నారు. గ్రంథాల సంఖ్యల్లోనే కాకుండా వాటిలోని విలువల్ని కూడా సాధించాడు. సుదీర్ఘమైన, సువిశాలమైన, వైవిధ్య కథాభరిత విశిష్ట వ్యక్తిత్వ చిత్రీకరణల సముదాయం కొలకలూరి ఇనాక్ సాహిత్యం. సరిహద్దులతో బంధించలేనంత అనుబంధాలు పెంపొందించుకున్న పెద్ద మనిషి ఇనాక్. సాహిత్య కూడలి మధ్యన కూర్చుని ఏ దారిన ప్రయాణించాలో చాలామంది సాహితీకారులకు తోచనట్టి సందర్భాలు ఉంటున్న నేపథ్యంలో తాను మాత్రం కూడలి మధ్యనే సాహిత్య తపస్సు చేస్తూ అన్ని దారులను, వాటి పిల్లదా రులను కూడా పలకరించి పరిపాలిస్తాడు. పొందికగా బోధివృక్షమై మార్గాన్ని చూపెడతాడు. పతనం అంచున కూడా శిఖరం అధిరోహించడం ఎలాగో తెలిసిన విలక్షణ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్. ఆకలి మంటల కార్ఖానా ఆయన జీవితం. లోకం పోకడలో పడి హృదయం లేని మనిషిగా బ్రతకటానికి ఏనాడూ ఇష్టపడని తత్వం ఆయనది. వాదాల గాథల్లో పడి కొట్టుకుపోలేదు. తన జీవితగాథను తన వాదంగా బయలు పరిచాడు. సాహిత్య ముడి సరుకు అయిన మాదిగ తత్వపు చెలిమే సమస్త మానవతత్వ వాదాలకు మూలమని నిత్య నూతనంగా ఊరింప జేస్తున్న జాంబ వంతుడు. తాను సృష్టించిన సాహిత్యంలో తమ తమ వాదాలను వెతుక్కునేలా, వెతుక్కోకుండా ఉండలేనంత స్ఫూర్తిని, స్పృహను తన సాహిత్యంలో పొందుపరచిన విలుకాడు భుజంగరాయుడు. విమర్శ రాయకుండా ఉండలేక, రాస్తున్నప్పుడు ఏ విమర్శకుడు కూడా నటిం పునకు లోనవకుండా విమర్శ రాసే సాహిత్యాన్ని సృష్టించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ కలం యొక్క కండరాల శక్తి భారతీయ సాహిత్యపు దిమ్మెలమీద జెండాను, ఎజెండాను ప్రకటింప జేసిన సాహిత్య ‘కల్న ల్’గా గౌరవం పొందారు. మునివర్గ, శిష్టవర్గ దృష్టికి ప్రత్యామ్నాయంగా జనుల విభిన్నత్వ దృష్టిలో నుండి సాహిత్యాన్ని రంగరిం చినా మునులు, శిష్టులు, జనులు జేజేలు పలుకుతున్న ఈ సాహిత్య తరువుని మూర్తిదేవి పురస్కారం వరించిన సందర్భంలో మాతాత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ.... (ఆచార్య కొలకలూరి ఇనాక్ని నేడు ‘మూర్తిదేవి’ అవార్డుతో సత్కరిస్తున్న సందర్భంగా) డప్పోల్ల రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజనం సాంస్కృతిక వేదిక