టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో శాఖమూరి మారుతి
నరసరావుపేట రూరల్: పేకాట శిబిరం నిర్వహిస్తూ తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ నరసరావుపేట రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.76,500ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చినట్టు రూరల్ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ కొంతకాలంగా పట్టణ శివారు సత్తెనపల్లిరోడ్డు సాయినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు.
అక్కడ జూద స్థావరం నిర్వహిస్తున్న మారుతీతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా మారుతీ జూదాన్ని వృత్తిగా ఎంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ మారుతీ పట్టుబడడంతో అతనిపై నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేటల నుంచి టీడీపీ నాయకులు మారుతీ ఆధ్వర్యంలో నిర్వహించే జూద శిబిరంలో పాల్గొనే వారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment