సుప్రీం కోర్టులో అమరావతి భూసేకరణ కేసు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లో భూ సేకరణపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే భూ సేకరణకు సంబంధించి.. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున అక్కడికే వెళ్లాలని సూచించింది.
హైకోర్టు తీర్పు తర్వాత అవసరం అయితే మళ్లీ తమన ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. కాగా 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని, అలాగే మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండానే భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్‌లో అభ్యంతరం తెలిపారు.