land acquisition notification
-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: లగచర్ల ‘ఫార్మా’ రద్దు
సాక్షి, హైదరాబాద్: కాలుష్య కారక పరిశ్రమలపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ‘లగచర్ల ఫార్మా విలేజ్’ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల్ మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో భూ సేకరణ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది.అయితే అదే సమయంలో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఫార్మా విలేజ్ స్థానంలో బహుళార్ధ సాధక పారిశ్రామిక పార్కు (మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు) ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజా భూ సేకరణ ప్రతిపాదనలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ).. ప్రభుత్వానికి సమర్పించింది. టీజీఐఐసీ ప్రతిపాదనలకు అనుగుణంగా తాండూరు ఆర్డీఓను భూ సేకరణ అధికారిగా నియమిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ప్రకటించారు.ఫార్మా విలేజ్ స్థానంలో ఏర్పాటయ్యే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో గతంలో ప్రతిపాదించిన భూమిని సేకరించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు ఇచ్చినట్లు టీజీఐఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. గతంలో పీఎంకే డిస్టిలేషన్స్ పొందిన అనుమతులపై ఆరా తీస్తోంది. గత ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి మరీ హడావుడిగా అనుమతులు ఇచ్చిందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రకారం కాకుండా 2006 డిస్టలరీస్ చట్టాన్ని సడలించి అనుమతులిచ్చారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మళ్లీ అవే గ్రామాలు.. అవే భూములు వికారాబాద్ జిల్లాలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల పరిధిలో 1,358.37 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సేకరించి ఇవ్వాలని కోరుతూ టీజీఐఐసీ ఈ ఏడాది జూన్ 7న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ 28న తాండూరు ఆర్డీఓను భూ సేకరణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 11కు అనుగుణంగా పోలేపల్లిలోని సర్వే నంబర్ 67లో 71.39 ఎకరాలు, లగచర్లలో 632.26 ఎకరాల పట్టా భూమిని సేకరిస్తామంటూ ఈ ఏడాది ఆగస్టులో ఆర్డీఓ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.అయితే ఫార్మా విలేజ్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారులపై దాడులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఫార్మా విలేజ్ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా అవే భూముల్లో స్థానికులకు ఉపాధి కల్పించేలా కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో భూసేకరణకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ శుక్రవారం నాటి ప్రకటనలో వెల్లడించారు. దిలావర్పూర్ అనుమతుల వెనుక గందరగోళం! నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్స్ ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోంది. ‘తెలంగాణ డిస్టిలరీ (మాన్యుఫ్యాక్చర్ ఆఫ్ స్పిరిట్స్) నిబంధనలు 2006’ను సవరించి మరీ దిలావర్పూర్ ఇథనాల్ యూనిట్‌తో పాటు కొత్తగా రాష్ట్రంలోని ఏడు డిస్టిలరీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ– ప్రాథమిక అవగాహన ఒప్పందం) జారీ చేయడం వెనుక గందరగోళం జరిగిందని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని కుటుంబం కోసం ఆఘమేఘాల మీద గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు ఇవ్వడంపై దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారని, రెడ్‌జోన్ కేటగిరీ ఫ్యాక్టరీకి అత్యవసరంగా అనుమతులు ఇవ్వడం వెనుక ఏదో మతలబు జరిగిందనే సందేహాలను ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ కేబినెట్ భేటీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే.. కేబినెట్ ఆమోదం లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్కు 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండ్రస్టియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి ఎల్ఓఐ జారీ చేయడాన్ని, ఆ తర్వాత రెండు నెలలకు కేబినెట్ రాటిఫై చేయడాన్ని ప్రశ్నిస్తోంది. ఫ్యూయల్ ఇథనాల్ కోసం దరఖాస్తు చేసిన పీఎంకే డిస్టిలేషన్స్ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకోకపోవడం, కంపెనీ స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఫ్యూయల్ ఇథనాల్ తయారీకి మాత్రమే అనుమతులు ఉండగా ఎల్‌ఓఐలో మిగతా ఉత్పత్తులను జోడించడాన్ని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు వచ్చాయని, తమ ప్రభుత్వం ఎల్ఓఐ ఆధారంగా కేవలం నీటి కేటాయింపులు మాత్రమే జరిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘226’ కింద న్యాయసమీక్షాధికారం స్వల్పం
సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ నోటిఫికేషన్‌కు అనుగుణంగా సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని కింది కోర్టు పెంచినప్పుడు, ఆ పెంపుదల సబబా? కాదా? అన్న విషయంపై అధికరణ 226 కింద హైకోర్టుకున్న న్యాయసమీక్షాధికారం చాలా స్వల్పమని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం అప్పీల్ దాఖలుకు అత్యుత్తమ మార్గం ఉందని చెప్పింది. దీని ప్రకారం రంగారెడ్డి జిల్లాలో వివిధ గ్రామాల పరిధిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) కోసం సేకరించిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని పెంచుతూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకోవాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం పెంపుపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అధికరణ 226 కింద కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు కొట్టేశారు. రంగారెడ్డి జిల్లాలో డీఆర్డీఎల్ కోసం 4వేల నుంచి 5వేల ఎకరాల భూమిని భూ సేకరణ నోటిఫికేషన్ ద్వారా 2004లో కేంద్రం సేకరించింది. 2007లో చదరపు గజానికి రూ.600 పరిహారంగా నిర్ణయించింది. దీన్ని పెంచాలంటూ భూ యజమానులు దిగువ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు పరిహారాన్ని 600 నుంచి 1,250కి పెంచింది. మరికొందరి భూముల విషయంలో పరిహారాన్ని రూ.4వేలకు పెంచింది. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్రం, డీఆర్డీఎల్లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. పరిహారం పెంచే ముందు భూ సేకరణ లబ్ధిదారులైన డీఆర్డీఎల్ అధికారులకు కింది కోర్టు నోటీసులు జారీ చేయకపోవడాన్ని తప్పుపట్టారు. -
సుప్రీం కోర్టులో అమరావతి భూసేకరణ కేసు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లో భూ సేకరణపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే భూ సేకరణకు సంబంధించి.. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున అక్కడికే వెళ్లాలని సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత అవసరం అయితే మళ్లీ తమన ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. కాగా 2013 భూ సేకరణ చట్టం సరిగా అమలు కావడం లేదని, అలాగే మూడు పంటలు పండే భూములను నోటిఫై చేయకుండానే భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్లో అభ్యంతరం తెలిపారు. -
బాబూ! ఇక నీ భూదోపిడీ సాగదు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి - కోర్టు తీర్పే సర్కార్‌కు చెంపపెట్టు సాక్షి, హైదరాబాద్: రాజన్న వారసులుగా, జగనన్న సైనికులుగా రాజధానిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగినా ప్రభుత్వంపై దండెత్తేందుకు ఏమా త్రం వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా రు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న భూదోపిడీకి రాష్ట్ర హైకోర్టు అడ్డుకట్ట వేయడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. హైకోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతుల భూములను బలవంతం గా లాక్కునే అప్రజాస్వామిక చర్యలు మాను కోవాలని హితవు పలికారు. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ, యథాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా డుతూ.... రైతన్న వ్యవసాయ పనులు యథా తథంగా కొనసాగించుకునేందుకు న్యాయ స్థానం స్పష్టంగా తీర్పునివ్వడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలు రైతులనుంచి లాక్కున్నారని, అందు లో ఒక్క శాతమైన రాజధాని నిర్మాణానికి వినియోగించారా..? అని నిలదీశారు. భయపెట్టడం వల్లే కోర్టుకు ఈనెల 11న పెనుమాక గ్రామానికి సంబం ధించి 660 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందని, దీనిపై రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని ఆర్కే గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెళితే ఇబ్బందులు వస్తాయని అడ్డదారిలో రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. పంటలు తగలబెట్టి, రైతన్నను అన్ని విధాలా హింసించి ప్రభుత్వం వేధింపులకు పాల్పడిం దని గత సంఘటనలను గుర్తు చేశారు. ఇప్పటికైనా న్యాయస్థానం తీర్పుకు లోబడి రైతన్న అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భూసేకరణ చేయలేరు మంగళగిరి (మంగళగిరి): రాజధాని భూస మీకరణకు భూములు ఇవ్వడం ఇష్టంలేని రైతులు కోర్టులను ఆశ్రయించి కోర్టు ఆదేశా లతో వ్యవసాయం చేసుకుంటుండగా, పైగా భూములకు సంబంధించిన అంశం కోర్టులో ఉండగా ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం అంటే చట్టాన్ని దుర్వినియో గం చేయడమేనని ఆర్కే మండిపడ్డారు. మం డలంలోని కురగల్లు, నవులూరు గ్రామాల పరిధిలో రాజధాని భూసమీకరణకు భూము లు ఇవ్వని రైతులకు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ చేయలేదని స్పష్టంచేశారు. -
ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు.
-
ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్ పై స్టేటస్ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పెనుమాక రైతులు స్వాగతించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తమ తరపున పోరాడుతున్నందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. -
క్యాపిటల్ పనిష్మెంట్
-
కోర్టు ధిక్కరణపై కేసు వేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే
-
కోర్టు ధిక్కరణపై కేసు వేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి : తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోషల్ ఇన్‌ఫ్యాక్ట్ అసెస్మెంట్ సరిగా జరగలేదని పది రోజుల క్రితం రైతులు కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడాని ప్రభుత్వం మూడు వారాల గడువు కోరిందనే విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈలోపే భూసేకరణ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టు ధిక్కరణపై కేసు వేస్తామని ఆర్కే తెలిపారు. చంద్రబాబు భూ దాహానికి అంతు అనేది లేకుండా పోతోందని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తాము ఏమైనా చేస్తాం, ఎదురు వస్తే ఎంతటికైనా తెగిస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. మూడు పంటల పండే భూమిని వదిలిపెట్టాలని గతంలో న్యాయస్థానం చెప్పినప్పటికీ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌తో కోర్టు ధిక్కరణకు పాల్పడిందన్నారు. కాగా పెనుమాక గ్రామానికి అధికారులు 660.83 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. -
రాజధాని గ్రామాల్లో రౌడీయిజం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రౌడీయిజం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై, భూములు ఇవ్వని రైతులపై టీడీపీ సర్కారు దౌర్జన్యానికి పాల్పడుతోంది. ల్యాండ్‌పూలింగ్‌కు ఇవ్వని పంటపొలాలను ధ్వంసం చేసి రైతుల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ధ్వంసం చేసేందుకు యత్నించారు. లింగాయపాలెం సమీపంలోని అనుమోలు గాంధీకి చెందిన పొలంలో బుధవారం భారీ చెట్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు పరుగు పరుగున రావడం గమనించిన డ్రైవర్లు జేసీబీలను విడిచి పారిపోయారు. రైతులు, ఐక్యవేదిక సభ్యులు పంటపొలాల వద్దకు చేరుకుని ప్రభుత్వ దౌర్జన్యంపై నిరసన తెలిపారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని చూస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. ఏం జరిగిందంటే.. లింగాయపాలెంలో అనుమోలు గాంధీకి సర్వే నంబర్ 184లో 4.03 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని ఆయన పూలింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పొలాన్ని లింగాయపాలెం గ్రామానికి చెందిన శంకరయ్య అనే రైతుకు కౌలుకు ఇచ్చారు. ఆ రైతు ఎకరానికి రూ.2.25లక్షల చొప్పున మొత్తం రూ.9లక్షలు వెచ్చించి మొక్కజొన్న, కంద పంట సాగు చేశారు. విరగపండిన మొక్కజొన్న కోతలు ప్రారంభించారు. ఇంకా కొంత కోయాల్సి ఉంది. అది పూర్తయ్యాక కంద తవ్వకం ప్రారంభించాలనుకున్నారు. ఇంతలో బుధవారం మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండు జేసీబీలు గాంధీ పొలం వద్దకు చేరుకున్నాయి. పంటపొలంలోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న భారీ తాటిచెట్లను జేసీబీలతో పెకలించటం ప్రారంభించారు. 10 చెట్లను పెకలించి నూర్పిడికి సిద్ధంగా చేసిన మొక్కజొన్న పంటలోనే పడేశారు. తాటిచెట్లను పెకలించే సమయంలో కంద పంట కూడా కొంత దెబ్బతింది. భారీ తాటిచెట్లు కిందపడే సమయంలో వచ్చిన శబ్ధంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. జేసీబీలు ఉన్న ప్రాంతానికి స్థానికులు కొందరు పరుగులు పెట్టారు. రైతులు వస్తున్నారని గమనించిన డ్రైవర్లు జేసీబీలను విడిచి పారిపోయారు. జేసీబీలను పంపించినదెవరు? రాజధాని గ్రామాల్లో ప్రభుత్వ దౌర్జన్యాలు ఓ పథకం ప్రకారం సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండలో ప్రభుత్వ విభాగాలు, అధికారులు పావులుగా వ్యవహరిస్తున్నారు. దౌర్జన్యాలు జరిగే సమయంలో సీఆర్డీఏ, రెవెన్యూ విభాగం నేరుగా రంగంలో ఉండటం లేదు. బుధవారం జరిగిన దౌర్జన్యకాండలోనూ సీఆర్డీఏ నేరుగా తెర మీదకు రాలేదు. భూములు ఇవ్వని రైతులను భయపెట్టి లాక్కోవడంలో భాగంగా ప్రభుత్వ పెద్దలే జేసీబీలు పంపించినట్లు రైతులు చెబుతున్నారు. ఉద్యమనేతలకు ప్రభుత్వ హెచ్చరిక! రాజధానిలో ప్రభుత్వం రైతుల చేస్తున్న అన్యాయాలపై దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకమై రాజధాని ఐక్యవేదిక పేరుతో ఇటీవల లింగాయపాలెంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఆ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని పలుగ్రామాల్లో నిపుణుల కమిటీ సభ్యులను రైతులు అడ్డుకోవటాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులను ఏకం చేస్తున్న ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఐక్యవేదిక సభ్యుడు అనుమోలు గాంధీని టార్గెట్ చేసి ఉద్యమకారులకు హెచ్చరికలు జారీ చేశారనే ప్రచారం జరుగుతోంది. భయపెట్టి బలవంతంగా లాక్కోవటమే లక్ష్యం రాజధాని ప్రకటించిన మొదట్లో భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులను ప్రభుత్వం రకరకాలుగా వేధిపులకు గురించేసింది. ఉండవల్లి, పెనుమాకలో అరటితోటను గుర్తుతెలియని వ్యక్తులు తగులపెట్టారు. మల్కాపురం వద్ద చెరుకుతోటకు నిప్పంటించారు. వెలగపూడి, లింగాయపాలెం పరిధిలోనూ పంటపొలాల్లో దౌర్జన్యం చేసి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. అదే తరహాలో మరోసారి రైతులను భయభ్రాంతులకు గురిచేసేందుకే జేసీబీలను పంపించిందని తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలపై ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు. భూముల కోసం రైతులను భయపెట్టాలని అనుకుంటే ప్రభుత్వం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఐక్యవేదిక కొనసాగిస్తున్న ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ దౌర్జన్యకాండపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. పెనుమాకకు నోటిఫికేషన్ రాజధానిలో మరో గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్ జారీ అయింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి అధికారులు 660.83 ఎకరాలకు నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్లో అధికారులు పేర్కొన్నారు. -
రాజధాని గ్రామాల్లో రౌడీయిజం
-
‘భూ సేకరణకు ఒప్పుకోం’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేఫన్ పై రాజధాని గ్రామాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ సర్కారు ఇచ్చిన భూసేకరణ ప్రకటన చెల్లదని కృష్ణాయపాలెం గ్రామస్తులు అంటున్నారు. భూసేకరణ చేయాలంటే తమ ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభలో తీర్మానం చేశామని, దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్ పై కోర్టుకు వెళ్లాలని గ్రామస్తులు భావిస్తున్నారు. మంగళగిరి మండలంలోని ఐనవోలు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో భూములు సేకరించేందుకు ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
ఉద్యమం ఉగ్రరూపం
మచిలీపట్నం : పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. భూమి కోల్పోయే రైతులంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. వందలమంది రైతులు మచిలీపట్నం - అవనిగడ్డ రహదారిపై శివగంగ డ్రెయిన్ వంతెనపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, పోర్టును 4,800 ఎకరాల పరిధిలో నిర్మించాలని కోరుతూ నినాదాలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాయమాటలకు స్వస్తి చెప్పి రైతుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని పలువురు రైతులు కోరారు. సర్వే పనులను అడ్డుకుంటామని, అధికారులను గ్రామాల్లోనే నిర్బంధిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని, భూములు వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. రైతులది బతుకు పోరాటం... రాస్తారోకో నుద్దేశించి పేర్ని నాని మాట్లాడుతూ బందరు పోర్టును 4,800 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని, పోర్టు నిర్మించాలని అందరం ఉద్యమాలు చేశామని చెప్పారు. పోర్టు నిర్మాణాన్ని పక్కనపెట్టి అనుబంధ పరిశ్రమల కోసం 25 వేల ఎకరాల భూమిని సేకరిస్తామని పాలకులు చెప్పటం దారుణమన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి, రూపాయి, రూపాయి కూడబెట్టి సంపాదించుకున్న భూమిని పోర్టు అనుబంధ సంస్థలు స్థాపించే విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు రైతులెవ్వరూ సిద్ధంగా లేరన్నారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మా కుటుంబానికి చెందిన భూములే 2వేల ఎకరాలు భూసేకరణలో పోతున్నాయని చెబుతున్నారని, ఎకరం భూమి కోల్పోయే రైతులకు 1400 గజాలు ఇస్తామని అంటున్నారని, రైతుల భూములు తీసుకోకుండా మీ రెండువేల ఎకరాల్లోనే పోర్టు నిర్మించాలని రైతులంతా కోరుతున్నారని చెప్పారు. రైతులది బతుకు పోరాటమని, ప్రభుత్వం భూములు తీసుకునే ప్రయత్నం మానుకోవాలని కోరారు. సీపీఎం నాయకుడు కొడాలి శర్మ మాట్లాడుతూ ప్రజల జీవనాన్ని దెబ్బతీసే భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగిస్తామన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఎకరం భూమి తీసుకుని 1400 గజాల స్థలం ఇస్తే దీనిలో మా సమాధులు నిర్మించుకోవాలా అని ఆగ్రహంతో ఊగిపోయారు. రాస్తారోకోలో పాల్గొన్న పేర్ని నాని, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ సహా మరో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ రాస్తారోకోలో వైఎస్సార్ సీపీ నాయకులు సలార్‌దాదా, మోకా భాస్కరరావు, లంకే వెంకటేశ్వరరావు, అస్గర్ తుమ్మలచెరువు, రుద్రవరం, గుండుపాలెం, కాలేఖాన్‌పేట, శారదానగర్, కోన, పాతేరు, పల్లెతుమ్మలపాలెం, గణపతినగర్, నెలితిప్ప, పోలాటితిప్ప తదితర గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
ప్రాణాలైనా ఇస్తాం..భూములు వదలం
భూసేకరణ నోటిఫికేషన్‌ను నిరసిస్తూ పురుగు మందు డబ్బాలతో ప్రదర్శన పోతేపల్లి(కోనేరుసెంటర్) : భూసేకరణ నోటిఫికేషన్‌తో బందరు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పలంగా వేలాది ఎకరాలు పోర్టు పేరుతో లాక్కుంటారో చూస్తామంటూ అటు ప్రభుత్వానికి, ఇటు పాలకులకు సవాళ్లు విసురుతున్నారు. భూములు అప్పగించే పరిస్థితే వస్తే ప్రాణాలైనా వదిలేస్తాం కాని నేల తల్లిని మాత్రం వదుకోమంటూ కరాఖండిగా చెబుతున్నారు. మహిళలైతే పురుగు మందులు తాగి ఆత్మహత్యలకైనా సిద్ధపడతామని చెబుతున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం బందరు మండలంలోని పోతేపల్లి, పెదకరగ్రహారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. పోతేపల్లిలోని మహిళలు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. పోర్టు పేరుతో ప్రభుత్వం మా భూములు లాక్కుంటే ఇవే పురుగు మందులు తాగి మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటూమంటూ హెచ్చరించారు. గ్రామంలో సుమారు 400 మంది గ్రామస్తులు గ్రామంలోని రామాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ గతంలో 3 వేల ఎకరాల్లో బందరు పోర్టు నిర్మించవచ్చని ఇదే నాయకులు చెప్పి అధికారంలోకి వచ్చాక పోర్టు నిర్మాణానికి పది రెట్లు అదనంగా భూములు కావాలంటూ నోటిఫికేషన్ జారీ చేయడం తగదన్నారు. ఒకపుడు 3 వేల ఎకరాలు చాలన్న టీడీపీ నాయకులు ఇపుడు 30 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని ఎవరెవరు ఎంతెంత పంచుకుంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ జారీతో ఇప్పటికే అనేక మంది రైతులు దిగులుతో మంచం పట్టినట్లు చెప్పారు. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోతేపల్లి ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు, మాజీ సర్పంచ్ కాటం మధుసూదనరావు, శ్రీపతి చంద్రం, సర్పంచ్‌లు మేకా లవకుమార్(నాని), చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గాజుల నాగరాజు, పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పాల్గొన్నారు. పెదకరగ్రహారంలో సర్పంచ్ శొంఠి కల్యాణి, ఫరీద్ బాబా దర్గా కమిటీ కార్యదర్శి శొంఠి ఫరీద్, చలమలశెట్టి ఏడుకొండలు, గురుజు పోతురాజు, కట్టా బైరాగి, సత్తినేడి నాగరాజు, అబ్దుల్హ్రీం, రైతులు పాల్గొన్నారు. అన్యాయం జరిగితే పదవీ త్యాగం చేస్తా - ఎంపీ కొనకళ్ల నారాయణ మచిలీపట్నం(కోనేరుసెంటర్) : భూసేకరణకు సంబంధించి రైతులకు అన్యాయం జరిగితే తన పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. బుధవారం ఎంపీ కొనకళ్ల తన కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూసేకరణకు సంబంధించి బాధిత రైతులతో చర్చలు, సంప్రదింపులు జరిపిన తరువాతే భూములు తీసుకుంటారన్నారు. బందరు ప్రాంత అభివృద్ది పోర్టుతోనే ముడిపడిఉందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. రైతులకు ఇంటికో ఉద్యోగంతో పాటు భూములకు కౌలు కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మునిసిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగ్రహ జ్వాల
మచిలీపట్నం : తమ కుటుంబాలకు అన్నం పెడుతున్న భూములను సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తే ప్రాణాలైనా వదులుకుంటాం గాని భూములు వదులుకునే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. బందరు పోర్టు, అనుబంధ పారిశ్రామిక అభివృద్ధి కోసం జిల్లా అధికారులు ఇటీవల పత్రికా ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో బందరు మండలంలో ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఏకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. బందరు పోర్టు నిర్మాణం కోసం 5,324 ఎకరాల భూమిని సేకరిస్తామని ఇంతకాలంగా చెబుతూ వచ్చిన పాలకులు, అధికారులు పోర్టు, అనుబంధ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏకంగా 30 వేల ఎకరాలను సేకరించేందుకు భూసేకరణ నోటిపికేషన్‌ను జారీ చేయడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కనీస సమాచారం లేకుండా, రైతులతో ఎలాంటి సంప్రదింపులూ జరపకుండా తమకు జీవనాధారంగా ఉన్న భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్ జారీపై ఆందోళన బందరు పోర్టు కోసం మంగినపూడి, తపశిపూడి, కరగ్రహారం, చిలకలపూడి, బందరు వెస్ట్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమిని సేకరిస్తామని ప్రకటించి హఠాత్తుగా 19 గ్రామాల్లోని 30 వేల ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బుధవారం కోన, కరగ్రహారం, పోతేపల్లి, గోకవరం గ్రామాల్లో రైతులు పార్టీలకతీతంగా సమావేశాలు నిర్వహించారు. భూమిని వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రైవేటు భూములను సర్వే చేసేందుకు అధికారులు గ్రామాలకు వస్తే వారిని ఇక్కడే నిర్బంధిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని కోన గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు పెరుమాళ్లు నాగేంద్రం, గంజాల శ్రీరాములు, కోమటి వెంకటేశ్వరరావు తదితరులు అన్నారు. కోన గ్రామ పరిధిలోని భూములతో పాటు గ్రామంలో నివాస భూమిని సైతం స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని వారు మండిపడ్డారు. కోన గ్రామంలో 2,072 ఎకరాల భూమిని సేకరిస్తే గ్రామంలోని రైతులకు ఒక్క ఎకరం కూడా మిగలదని, వీరంతా ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం బందరు మండలంలోని పొట్లపాలెం, పోతిరెడ్డిపాలెం, పోతేపల్లి గ్రామాలకు చెందిన రైతులు, పలువురు మహిళలు పోతేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. పురుగుమందు డబ్బాలు సహా తరలివచ్చిన వీరు ప్రభుత్వం భూములు తీసుకుంటే తామంతా ఆత్మహత్యలు చేసుకుంటామని, ప్రభుత్వం తమ ఉసురు కట్టుకోవద్దని నినాదాలు చేశారు. అనంతరం పోతేపల్లి హైస్కూల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు గాజుల నాగరాజు, పోతేపల్లి ఎంపీటీసీ పిప్పళ్ల నాగబాబు, మాజీ సర్పంచ్ కాటం మధుసూదనరావు, శ్రీపతి చంద్రం, పోసిన బాబూరావు తదితరులు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాలెం సర్పంచ్ మేకా లవకుమార్ తదితరులు మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతుల భూములను బడా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సాహసిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గ్రామాల్లో సర్వే పనులను ముందుకు సాగనివ్వబోమని హెచ్చరించారు. కరగ్రహారం పంచాయతీ కార్యాలయం వద్ద రైతులు సమావేశం నిర్వహించి భూమి సర్వే పనులను జరగనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. గోకవరం సంతబజారు వద్ద గోకవరం, చిరివెళ్లపాలెం తదితర గ్రామాల రైతులు సమావేశమై భూసేకరణ అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐకమత్యంగా ఉండండి : పేర్ని నాని భూసేకరణకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల్లో రైతులు సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన, గోకవరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణానికి ఐదారు గ్రామాల్లో ఐదువేల ఎకరాల భూములు తీసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలకు 19 గ్రామాల పరిధిలోని 30 వేల ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం దారుణమన్నారు. రైతులకు జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం అకారణంగా గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పార్టీలకతీతంగా జెండాలను పక్కనపెట్టి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రైతులంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. రైతులు చేసే ప్రతి ఉద్యమానికి తాను మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చారు. 19 గ్రామాల్లో సర్వే చేసేందుకు ఒకటి, రెండు రోజుల్లో అధికారులు వచ్చే అవకాశం ఉందని, ఒక్క గ్రామంలో కూడా సర్వే పనులు జరగకుండా రైతులంతా ఐకమత్యంగా అడ్డుకోవాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వానికి రైతుల మనోభావాల తీవ్రత అర్థమవుతుందన్నారు. -
రెండు వారాలు చర్యలుండవు
భూసేకరణ నోటిఫికేషన్‌పై హైకోర్టుకు ఏపీ సర్కారు హామీ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను భూసేకరణ ద్వారా సేకరించేందుకు వీలుగా జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి రెండు వారాలపాటు తాము ఎటువంటి చర్యలు చేపట్టబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) ఇచ్చిన ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. భూసేకరణ ద్వారా భూములను సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేయాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన రైతులు మొక్కపాటి స్వర్ణ తదితరులు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారించారు. 2013లో తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ 4లోని సెక్షన్ 10 ఎ(1) ప్రకారం ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టును చేర్చిందని, ఇలా చేర్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టును ప్రజోపయోగ ప్రాజెక్టుగా ఆర్డినెన్స్ 4లో పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త భూసేకరణ చట్టంలో ఆహార భద్రత గురించి ప్రస్తావన ఉందని, దీనిప్రకారం బహుళ పంటలు పండే సాగు భూములను సేకరించడానికి వీల్లేదని తెలిపారు. అదనపు ఏజీ డి.శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ‘మౌలిక సదుపాయాల ప్రాజెక్టు’కు విస్తృత అర్థముందని నివేదించారు. ఈ రోజుకీ భూసమీకరణ ద్వారానే భూములను తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ దానికి సంబంధించి రెండు వారాలపాటు ఎటువంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు నివేదించారు. గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ.. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేశారు. -
పోర్టు భూసేకరణకు నోటిఫికేషన్...వారం రోజుల్లో
18న రైతులతో కలెక్టర్ ముఖాముఖి భూమి కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల మచిలీపట్నం / చిలకలపూడి : బందరు పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు వారం రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కలెక్టర్ బాబు.ఎ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పోర్టు భూముల భూసేకరణ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోర్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఎటువంటి పొరపాట్లూ జరగకుండా పోర్టు నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను, ఎంపీ కొనకళ్ల పోర్టు భూసేకరణకు సంబంధించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వారు భూమిని అప్పగించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారన్నారు. ఈ నెల 18న అంబేద్కర్ భవన్లో కలెక్టర్ బాబు.ఎ పోర్టు భూసేకరణకు సంబంధించిన రైతులతో చర్చిస్తారన్నారు. రైతుల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు కృషిచేయనున్నట్టు చెప్పారు. ఖాళీ అయ్యే గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... పోర్టు నిర్మాణంలో రెండు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని క్యాంప్‌బెల్‌పేట, పల్లెపాలెం గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని రవీంద్ర చెప్పారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు భూసేకరణకు సంబంధించి భూముల సర్వే పూర్తయిందన్నారు. సేకరించిన భూములకు సంబంధించి రైతులకు మంచి ధర పరిహారంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.