అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేఫన్ పై రాజధాని గ్రామాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ సర్కారు ఇచ్చిన భూసేకరణ ప్రకటన చెల్లదని కృష్ణాయపాలెం గ్రామస్తులు అంటున్నారు. భూసేకరణ చేయాలంటే తమ ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభలో తీర్మానం చేశామని, దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్ పై కోర్టుకు వెళ్లాలని గ్రామస్తులు భావిస్తున్నారు.
మంగళగిరి మండలంలోని ఐనవోలు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో భూములు సేకరించేందుకు ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
‘భూ సేకరణకు ఒప్పుకోం’
Published Thu, Jan 5 2017 7:22 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
Advertisement
Advertisement