krishnayapalem
-
కల నెరవేరిన ఆనందం..కన్నీళ్లు పెట్టుకున్న మహిళ
-
మోడల్ హౌస్ ను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్ జీవితాంతం రుణపడి ఉంటా లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. :::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘భూ సేకరణకు ఒప్పుకోం’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేఫన్ పై రాజధాని గ్రామాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ సర్కారు ఇచ్చిన భూసేకరణ ప్రకటన చెల్లదని కృష్ణాయపాలెం గ్రామస్తులు అంటున్నారు. భూసేకరణ చేయాలంటే తమ ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభలో తీర్మానం చేశామని, దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్ పై కోర్టుకు వెళ్లాలని గ్రామస్తులు భావిస్తున్నారు. మంగళగిరి మండలంలోని ఐనవోలు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో భూములు సేకరించేందుకు ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. -
ప్రపంచస్థాయి శ్మశానం నిర్మిస్తాం
- రిజర్వాయర్ కోసం శ్మశానం తొలిగిస్తే చనిపోయినవాళ్లను ఎక్కడపెట్టాలి? - ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తే రాజధాని ఠీవి తగ్గట్లు గొప్ప శ్మశానం కడతాం - సీఆర్ డీఏ కు కృష్ణాయపాలెం గ్రామపంచాయతీ వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం(మంగళగిరి మండలం) గ్రామానికి ఊహించని సమస్య ఎదురైంది. ఆ ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానం.. త్వరలో నిర్మించనున్న రిజర్వాయర్ లో మునిగిపోతుందని సీఆర్ డీఏ అధికారులు ప్రకటించడమే సమస్యకు అసలు కారణం. రిజర్వాయర్ నిర్మాణానికి భూమి తీసుకుంటామన్న అధికారులు.. శ్మశానానికి ప్రత్యామ్నాయంపై మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో సీఆర్ డీఏ తీరును తప్పుపడుతూ బుధవారం సర్పంచ్ ఈపూరి కన్నయ్య అధ్యక్షతన జరిగిన పంచాయతీ సమావేశం తీర్మానాలు చేసింది. రాజధాని నిర్మాణం నిమిత్తం ప్రస్తుతం ఉన్న గ్రామాలను కదిలించబోమనే ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చామని, ఊరంతటికీ ఉపయోగపడే శ్మశానాన్ని తొలగిస్తామన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామపంచాయతీ సాధారణ సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. శ్మశానం స్థలాన్ని మినహాయించి రిజర్వాయర్ నిర్మించాలని, అలా కుదరని పక్షంలో గ్రామానికి ఉత్తరంగా ప్రత్యామ్నాయస్థలాన్ని చూపిస్తే గ్రామంలోని ప్రతి రైతూ గజానికి రూ. ఒకటి వంతున చందా వేసుకుని ప్రపంచస్థాయి శ్మశానం నిర్మించుకుంటామని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని తీర్మానంలో కోరారు. తీర్మానాల ప్రతిని సీఆర్డీఏ కార్యాలయంలో గ్రామం తరపున అందచేశారు. -
కోర్టును ఆశ్రయించనున్న కృష్ణాయపాలెం గ్రామస్తులు?
సాక్షి, హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ వే పేరుతో తమ గ్రామాన్ని మాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని కృష్ణాయపాలెం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామం సీఆర్డీఏ పరిధిలో ఉంది. ఈ గ్రామం మీదుగా 200 మీటర్ల వెడల్పుతో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది. ప్రస్తుతం గ్రామం 500 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 100 ఇళ్లతో విస్తరించి ఉంది. ఎక్స్ ప్రెస్ వే ను మధ్య నుంచి ఏర్పాటు చేస్తే సగం గ్రామం కనుమరుగు కానుంది. అంటే సుమారు 50 నుంచి 60 ఇళ్లను బలవంతంగా తొలగించనున్నారు. ఇదే గ్రామంలో సుమారు 120 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన రామాలయం ఉంది. ఈ రామాలయాన్ని తొలగిస్తే మిగిలిన ఇళ్లు కూడా కనుమరుగు అవుతాయి. నూతన రాజధాని అమరావతికి ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా చేరుకుంటారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల మీదుగా ప్రయాణించి కృష్ణాయపాలెం వద్ద ఎక్స్ ప్రెస్ వే మీదకు చేరుకుంటారు. ఎక్స్ ప్రెస్ వే మీద ప్రముఖులు ప్రయాణించే సమయంలో తాను అనుకున్న వరల్డ్ క్లాస్ సిటీకి ముఖద్వారంగా ఇంత చిన్న గ్రామం ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
కృష్ణాయపాలెం (తాడేపల్లిగూడెం రూరల్) : కృష్ణాయపాలెంలో ఓ మానసిక వికలాంగురాలిపై వరసకు చిన్నాన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన 24 ఏళ్ల మాన సిక వికలాంగురాలికి అదే గ్రామానికి చెందిన వరుసకు చిన్నాన్న అయిన తాడేపల్లి లక్ష్మణరావు మాయమాటలు చెప్పి తినుబండారులు ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి ఈనెల 3న అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కఠారి రామారావు ఆదివారం చెప్పారు.