సాక్షి, హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ వే పేరుతో తమ గ్రామాన్ని మాయం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని కృష్ణాయపాలెం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామం సీఆర్డీఏ పరిధిలో ఉంది. ఈ గ్రామం మీదుగా 200 మీటర్ల వెడల్పుతో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది. ప్రస్తుతం గ్రామం 500 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 100 ఇళ్లతో విస్తరించి ఉంది. ఎక్స్ ప్రెస్ వే ను మధ్య నుంచి ఏర్పాటు చేస్తే సగం గ్రామం కనుమరుగు కానుంది. అంటే సుమారు 50 నుంచి 60 ఇళ్లను బలవంతంగా తొలగించనున్నారు. ఇదే గ్రామంలో సుమారు 120 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన రామాలయం ఉంది. ఈ రామాలయాన్ని తొలగిస్తే మిగిలిన ఇళ్లు కూడా కనుమరుగు అవుతాయి.
నూతన రాజధాని అమరావతికి ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా చేరుకుంటారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల మీదుగా ప్రయాణించి కృష్ణాయపాలెం వద్ద ఎక్స్ ప్రెస్ వే మీదకు చేరుకుంటారు. ఎక్స్ ప్రెస్ వే మీద ప్రముఖులు ప్రయాణించే సమయంలో తాను అనుకున్న వరల్డ్ క్లాస్ సిటీకి ముఖద్వారంగా ఇంత చిన్న గ్రామం ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టును ఆశ్రయించనున్న కృష్ణాయపాలెం గ్రామస్తులు?
Published Sun, Jan 3 2016 5:51 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement