కృష్ణాయపాలెం (తాడేపల్లిగూడెం రూరల్) : కృష్ణాయపాలెంలో ఓ మానసిక వికలాంగురాలిపై వరసకు చిన్నాన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన 24 ఏళ్ల మాన సిక వికలాంగురాలికి అదే గ్రామానికి చెందిన వరుసకు చిన్నాన్న అయిన తాడేపల్లి లక్ష్మణరావు మాయమాటలు చెప్పి తినుబండారులు ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి ఈనెల 3న అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కఠారి రామారావు ఆదివారం చెప్పారు.