లబ్ధిదారు కుటుంబానికి ఇంటి పట్టా అందజేస్తున్న సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్‌లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు.
సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె.
తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్
జీవితాంతం రుణపడి ఉంటా
లేఅవుట్‌లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
:::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం
అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది.
ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment