
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో టీడీపీ నేతల మరో భూ దందా వెలుగుచూసింది. ఓ వృద్ధురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌బాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకవచ్చారు. తనకు జరిగిన అన్యాయం ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన వృద్ధురాలి భూమిని కబ్జా చేసిన టీడీపీ నేతలు.. ఆమెను బలవంతంగా గెంటివేశారు. తనకు జరిగిన అన్యాయంపై సదురు వృద్ధురాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని తెలిపారు. దీనిపై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయకుండా పనులు సాగిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment