తాడేపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు | TDP Leaders Attacked YSRCP Activists And Woman In Mangalagiri Tadepalli | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Published Thu, Apr 11 2019 5:58 PM | Last Updated on Thu, Apr 11 2019 6:41 PM

TDP Leaders Attacked YSRCP Activists And Woman In Mangalagiri Tadepalli - Sakshi

సాక్షి, గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో టీడీపీ కార్యకర్తలు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైసీపీకి అధిక శాతం ఓట్లు నమోదు కావడాన్ని తట్టుకోలేక ఆ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. మహిళలని చూడకుండా వారిపై కూడా దాడి చేశారు. జనాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. టీడీపీ నేతల పక్షాన చేరి ఈ దాడులకు సహకరించటం గమనార్హం. ఈ దాడులపై వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఓ వైసీపీ కార్యకర్త తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో ప్రస్తుతం తాడేపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement