ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారని, ఏపీ డీజీపీకి కనీస పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడి చేసి ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూశారన్నారు.