సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల ఆస్తులను కొట్టేయాలని ప్రయత్నిస్తే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని సీఎం చంద్రబాబును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) హెచ్చరించారు. సదావర్తి భూముల వేలం కేసులో శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలకు, వివిధ ట్రస్టులకు దాతలు ఇచ్చిన భూములను కొట్టేయాలని చూస్తే మాత్రం తాము అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.