రాజధానిలో రియల్ దందాపై సీబీఐతో విచారించాలి
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందంటూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో చేస్తున్నదంతా అవినీతేనం టూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాల యంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు.
రాజధాని పేరుతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తొలి నుంచి చెబుతోందని, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటల ద్వారా రుజువైంద న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారెవరూ గతంలో ఇలాంటి ఆరోపణలు ముఖ్యమంత్రులపై చేయలే దన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నపుడు పని చేసి న చిన్న ఉద్యోగి మొదలు ఉన్నతోద్యోగి వరకూ ఆయన నిర్ణయాలను ఎవరూ తప్పుబట్టలేద న్నారు. బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో న్యాయస్థానాలు నేరుగా స్పందించాయని అలాగే రాజధాని విషయంలో కూడా కోర్టులు సుమొటోగా కేసు స్వీకరించాలని కోరారు.
తొమ్మిది నగరాల అడ్రస్ ఎక్కడ?
రాజధానిలో నవ నగరాలు నిర్మిస్తానని చంద్రబాబు ప్రకటనలు చేశారని, ఇప్పటి వరకూ అవి ఎక్కడున్నాయో అడ్రస్ కూడా లేవన్నారు. స్విస్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాజధానిని విక్రయిం చేలా వ్యవహరించారన్నారు.