Capital development
-
రాజధాని అభివృద్ధి.. ఆరు నెలల్లో అసాధ్యం
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయడం తమకు, సీఆర్డీఏకు అసాధ్యమని.. ఇందుకు ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాజధాని ప్రాంత పురోగతి, అభివృద్ధి అన్నది అస్పష్టమైనదని, అది ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతూ ఉంటుందని తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలోపు రాజధాని ప్రాంత అభివృద్ధిని పూర్తిచేస్తామని చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది. రాజధాని నగరం, ఆ ప్రాంతం అభివృద్ధికి తీర్పులో నిర్దేశించిన నిర్ణీత కాల వ్యవధులను తొలగించాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేదా తీర్పులో భూ యజమానులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఆరు నెలల్లో అభివృద్ధిచేసి ఇచ్చే ప్రక్రియ గడువును ఐదేళ్లకు పెంచాలని అభ్యర్థించింది. చదవండి: AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే? అంతేకాక.. భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిని మాత్రమే చేపట్టేందుకు తమను, సీఆర్డీఏను అనుమతించాలని కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నామని.. ఈ నేపథ్యంలో నిధుల లభ్యత, ఇతర ప్రాధాన్యతలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. భూసమీకరణలో భూములిచ్చిన యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి ప్రక్రియకు సంబంధించిన వివరాలకు మాత్రమే ప్రస్తుత ఈ అఫిడవిట్‌ను పరిమితం చేస్తున్నట్లు ఆయన తన అఫిడవిట్లో తెలిపారు. అఫిడవిట్ ఎందుకంటే.. రాజధాని అమరావతి వ్యవహారంలో ఇటీవల హైకోర్టు తీర్పునిస్తూ, రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచి్చన యజమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన రీతిలో అభివృద్ధిచేసి మూడు నెలల్లో అప్పగించాలని కూడా ఆదేశించింది. అంతేకాక.. రాజధాని అభివృద్ధికి సంబంధించిన పురోగతితో ఎప్పటికప్పుడు అఫిడవిట్లు వేయాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫున సమీర్‌శర్మ శుక్రవారం అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఆ అభిప్రాయం రాకూడదనే.. రాజధాని అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. కాంట్రాక్టర్లకు, బ్యాంకులకు, ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన యజమానులకు రాసిన లేఖలు.. నిధుల కోసం కేంద్రానికి, నీతి ఆయోగ్‌కు రాసిన లేఖలు వంటి పలు డాక్యుమెంట్లను జతచేస్తూ 190 పేజీల అఫిడవిట్‌ను సీఎస్ కోర్టు ముందుంచారు. ఇందులో.. రాజధాని విషయంలో గతనెల 3న ఇచ్చిన తీర్పు పర్యవసానాలను, న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని సమీర్‌శర్మ పేర్కొన్నారు. న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకునే ముందు ఈ తీర్పు అమలులో ఉన్న ఇబ్బందులను, ఆచరణ సాధ్యంకాని పరిస్థితులను వివరించేందుకే ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న అభిప్రాయం రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అఫిడవిట్‌ను సదుద్దేశంతో దాఖలు చేస్తున్నామని వివరించారు. సమీర్‌శర్మ కౌంటర్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. కనీసం 60 నెలలు పడుతుంది ♦ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (భూ యజమానులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి) కోసం కనీసం 60 నెలల గడువు అవసరం. ♦కాంట్రాక్టుల గడువు పెంపు, అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ, అనుమతుల మంజూరు, అనుబంధ ఒప్పందాలకు రెండు నెలల సమయం పడుతుంది. ♦పరిశీలనలు, సర్వే, డిజైన్ల పూర్తికి నాలుగు నెలలు.. మనుషులు, యంత్రాల సమీకరణకు రెండు నెలలు.. పనులన్నీ మొదలు కావడానికి 8 నెలల సమయం పడుతుంది. ♦రోడ్ల నిర్మాణానికి 16 నెలలు.. నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 36 నెలల సమయం పడుతుంది. ♦వీటన్నింటినీ పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సేకరణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అఫిడవిట్ల ద్వారా తెలియజేస్తాం. కేంద్రం ఇచ్చింది రూ.1,500 కోట్లే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఐఏఎస్ టవర్లలో పనులు తిరిగి ప్రారంభించాం. 31.11.2022 వరకు పనుల గడువును పొడిగించాం. పనులు చేస్తున్న ఏజెన్సీకి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించాం. ఎన్జీఓ అపార్ట్మెంట్స్, గెజిటెడ్ ఆఫీసర్లు టైప్–1, టైప్–2 అపార్ట్మెంట్స్, గ్రూప్–డి అపార్ట్‌మెంట్స్‌లో మిగిలిన పనులు సమయానుకూలంగా మొదలవుతాయని ఆశిస్తున్నాం. కాంట్రాక్టర్ ఇటీవలే పనుల పూర్తికి గడువు పెంచాలని అభ్యరి్థంచారు. రాజధాని నగర నిర్మాణం కోసం కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం రూ.3,024 కోట్లు ఇవ్వగా, రుణాల కింద రూ.5,107 కోట్లు తీసుకున్నాం. మొత్తం పనుల అంచనా విలువ రూ.42,170 కోట్లు. మొదలైన పనుల విలువ రూ.41,678 కోట్లు. కన్సల్టెన్సీ చార్జీలు రూ.322 కోట్లు.. తిరిగి చెల్లించిన రుణాలు రూ.1,756 కోట్లు, భూ సమీకరణ, భూ సేకరణ వ్యయం రూ.1,989 కోట్లు. ఇక సీఆర్డీఏ తన వద్ద ఉన్న భూములు అమ్ముకోవచ్చు. అలా అమ్మడం ద్వారా వచి్చన నిధులే సీఆర్డీఏకు ప్రధాన ఆరి్థక వనరు. ఇక ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మూడు బ్యాంకుల కన్సార్టియం రూ.2,060 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1,862 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. మిగిలిన రూ.198 కోట్ల విడుదలకూ అంగీకరించింది. యూనియన్ బ్యాంకు రూ.93 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ.105 కోట్లను బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు త్వరలో విడుదల చేయనున్నాయి. మిగిలిన పనులకు రూ.42వేల కోట్లు ఖర్చు రాజధాని ప్రాంతంలో మిగిలిన పలు పనుల పూర్తికి రూ.42,231 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ విషయంలో నిధుల సమీకరణకు ఆయా ఆర్థిక సంస్థలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొదటి దశ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయం మొత్తం రూ.51,687 కోట్లు. ఇందులో 2015–19 వరకు ఇచ్చింది రూ.1,377 కోట్లు. 2020–22 మధ్య ఇచ్చింది రూ.1,646 కోట్లు. సీఆర్డీఏ సేకరించిన రుణం రూ.5,122 కోట్లు. ల్యాండ్ పూలింగ్ కింద మౌలిక సదుపాయాల కల్పనకు, రాజధాని నగర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ను దశల వారీగా అమలుచేస్తాం. మాస్టర్‌ప్లాన్ దశల వారీ అభివృద్ధికి అవసరమైన రూ.3 వేల కోట్ల రుణ సేకరణకు సీఆర్డీఏకి గ్యారెంటీగా కూడా ఉన్నాం. అయితే, సీఆర్డీఏ నిధులను సమీకరించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. గ్యారెంటీ కాలాన్ని పొడిగించాలని కోరింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేయనున్నాం. కాంట్రాక్టర్లతో, ఆర్థిక సంస్థలతో, కేంద్ర ప్రభుత్వంతో నిధుల గురించి మాట్లాడి నిధుల కొరతను ఓ కొలిక్కి తీసుకురావడానికి తగినంత సమయం పడుతుంది. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు లేఖలు పంపాం ఇక 22,276 రిటర్నబుల్ ప్లాట్లలో 17,357 ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉంది. మిగిలిన 4,919 ప్లాట్లలో 1,598 ప్లాట్ల విషయంలో కేసులు నమోదై ఉన్నాయి. అసైన్డ్ భూముల చట్ట నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల ఆక్రమణ, రికార్డుల తారుమారు, ఖజానాకు భారీ నష్టం తదితర అంశాలపై కేసులు నమోదు చేశాం. ఈ 17,357 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భూ యజమానులకు లేఖలు పంపాం. కానీ, ఇప్పటివరకు 231 నివాస, 107 వాణిజ్య ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి నెలల సమయం పడుతుంది. ఏపీ సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్–58లో ఆయా పనుల పూర్తికి నిర్ధిష్ట కాల వ్యవధులను నిర్ధేశించారు. ఒకవేళ ఆ కాల వ్యవధిలోపు పనులు పూర్తికాకుంటే, వాటన్నింటి విషయంలో ఏపీసీఆర్డీఏ తిరిగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ స్కీం (ఎల్పీఎస్) నిబంధనల ప్రకారం.. తుది నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి మూడేళ్లలో మౌలిక సదుపాయాలన్నింటినీ పూర్తిచేసి ప్లాట్లను అప్పగించాల్సి ఉంటుంది. ఎల్పీఎస్ నిబంధనల్లో నిర్ధేశించిన గడువును 2024 జనవరి వరకు పొడిగిస్తూ 2020లోనే సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. రాజధానికి, మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు ఏపీ పునరి్వభజన చట్ట నిబంధనల ప్రకారం.. రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి తదితర భవనాల నిర్మాణానికి కేంద్రం ఆరి్థక సాయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇచ్చింది. వీటి కోసం రాష్ట్రం ఇప్పటివరకు రూ.1,632 కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,023 కోట్లను గ్రాంట్‌గా ఇచి్చంది. గతంలో ఇచి్చన అంచనా మొత్తాలు ఇప్పుడు పెరిగే అవకాశముంది. రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.1.09 లక్షల కోట్లు కోరుతూ 2018లో కేంద్రానికి లేఖ రాశాం. ఇందులో భాగంగా రూ.62,625 కోట్లకు డిపీఆర్‌లు కూడా సమర్పించాం. కేంద్రం ఇటీవల వీటి విషయంలో కొన్ని స్పష్టతలు కోరింది. ఆ పనిలో రాష్ట్రం ఉంది. ఒప్పందాల పునరుద్ధరణకు సమయం పడుతుంది రాజధాని నగర అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఉన్నాం. అందులో భాగంగా గత నెల 23న పలు బ్యాంకులతో సమావేశం నిర్వహించాం. అవి పలు వివరాలు కోరాయి. వాటిని సమర్పించే పనిలో సీఆర్డీఏ ఉంది. రోడ్ల పనులను తిరిగి ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఇందుకు అవసరమైన భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లతో ఒప్పందాలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. కాంట్రాక్టర్లు యంత్రాలు, మనుషులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సైతం సమయం పడుతుంది. వీలైనంత త్వరగా పనుల ప్రారంభానికి అనుమతులిచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. -
సింగపూర్ సహకారంతో రాజధాని అభివృద్ధి
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: సింగపూర్ సహకారంతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, అమరావతి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ ప్రభుత్వం అందించిన సహకారం మరిచిపోలేమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రగతి, రియల్‌టైం గవర్నెన్స్, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో నిర్మించనున్న వెల్కం గ్యాలరీకి గురువారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో విస్తారంగా వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకుని అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, పరిపాలన వ్యవహారాల్లో సింగపూర్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగున్నరేళ్లలో కోటిన్నర ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి: ఈశ్వరన్ సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యం రాజధాని అభివృద్ధికి దోహదపడుతుందని సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్ పేర్కొన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా వెల్కం గ్యాలరీ నిర్మాణం జరగనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమ బంధం దృఢపడుతోందని, స్విస్ చాలెంజ్‌లో మొదటి దశ పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి తమ ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. -
రాజధాని అభివృద్ధికి సినీ నటులు కృషి చేయాలి
ఆత్మకూరు(మంగళగిరిటౌన్): రాజధాని అభివృద్ధికి సినీ రంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునించారు. శనివారం రాత్రి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలోని హ్యాపీ రీసార్ట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఉగాది పురస్కారాల వేడుకల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. చలన చిత్ర అవార్డుల కమిటి చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామం వద్ద మీడియా సిటి నిర్మిసామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, విశాఖపట్టణంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పలు ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ఈ సదర్భంగా ప్రముఖ సినీనటుడు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సినీకళాకారునిగా, ఎంపిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, నటనలో తనదైన శైలిలో సత్యనారాయణ తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం... ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కైకాల సత్యనారాయణ 750 చిత్రాలలో విలక్షణపాత్రలను పోషించి, చిత్రసీమకు పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చేందుకు తనదై శైలిలో విశేష కృషి చేశారని తెలిపారు. చలనచిత్ర అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతులు మీదుగా సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. సత్యనారాయణతో పాటు ఉత్తమ దర్శకులుగా గరుడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్, మళ్లీరావా చిత్ర దర్శకుడు గీతంనాయుడుకు, శేఖరం గారి అబ్బాయి చిత్రం దర్శకుడు అక్షిత్శ్రీనివాసన్, ఒక్కడే మిగిలాడు చిత్ర దర్శకుడు అజెయ్ ఆడ్రూస్లకు ఉత్తమ దర్శకులు అవార్డులను ప్రదానం చేవారు. ఉత్తమ నటులు రవివర్మ(గరుడవేగ), అప్పాజి(మళ్లిరావే), ఉత్తమ నటి సాయిసుధభీమిరెడ్డి(అర్జున్‌రెడ్డి), హిమజ(శతమానంభవతి), కల్పాలిత్(బహుబలి2), ఉత్తమ నిర్మాతలు రాహుల్‌యాదవ్(మళ్లీరావే), దిల్‌రాజు(ఫిదా), త్తమ గాయకురాలు సోని(బహుబలి2), సంగీత దర్శకులు శక్తీకార్తిక్(ఫిదా) ప్రత్యేక పురస్కారాలు సౌమ్యావేణుగోపాల్(కాటమరాయుడు), మనారాచోప్రా(రోగ్), మనాలీరాథోడ్(లేడీస్టైలర్), సోనీచరిస్టా(టాప్‌ర్యాంకర్)గా ఎంపికైయ్యారు. జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల -
రాజధానిలో రియల్ దందాపై సీబీఐతో విచారించాలి
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందంటూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో చేస్తున్నదంతా అవినీతేనం టూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాల యంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ తొలి నుంచి చెబుతోందని, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మాటల ద్వారా రుజువైంద న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వారెవరూ గతంలో ఇలాంటి ఆరోపణలు ముఖ్యమంత్రులపై చేయలే దన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నపుడు పని చేసి న చిన్న ఉద్యోగి మొదలు ఉన్నతోద్యోగి వరకూ ఆయన నిర్ణయాలను ఎవరూ తప్పుబట్టలేద న్నారు. బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో న్యాయస్థానాలు నేరుగా స్పందించాయని అలాగే రాజధాని విషయంలో కూడా కోర్టులు సుమొటోగా కేసు స్వీకరించాలని కోరారు. తొమ్మిది నగరాల అడ్రస్ ఎక్కడ? రాజధానిలో నవ నగరాలు నిర్మిస్తానని చంద్రబాబు ప్రకటనలు చేశారని, ఇప్పటి వరకూ అవి ఎక్కడున్నాయో అడ్రస్ కూడా లేవన్నారు. స్విస్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాజధానిని విక్రయిం చేలా వ్యవహరించారన్నారు. -
విదేశీపాలనకు తెరతీస్తున్న చంద్రబాబు
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేటవెస్ట్ : రాజధాని అభివృద్ధి పేరుతో రైతులు పొట్టకొట్టి గుంజుకున్న వేలాది ఎకరాలను సింగపూర్, జపాన్ కంపెనీలకు 99ఏళ్లపాటు లీజుకు ఇచ్చి మరోసారి విదేశీపాలనను రాష్ర్ట ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు రుచి చూపబోతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు బంగారు పంటలు పండే భూములను దోచి పెట్టేందుకే చీకటి జీవోలు జారీచేస్తున్నారన్నారు. ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడే చంద్రబాబు 110 జీవోను ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదో, దీని వెనుక ఉన్న చీకటి ఒప్పందాలను బహిరంగ పర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరు ఎయిర్‌పోర్టులకు 90వేల ఎకరాలు సేకరించాలని చూడడం ప్రభుత్వ భూదాహానికి అద్దం పడుతుందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదన్నారు. ప్రభుత్వం పద్ధతులు మార్చుకోకుంటే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. రైతన్నల అండలతో ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయంచేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామాలు గల్లంతే !
► రాజధాని ప్రాంతంలో పల్లెల మనుగడకు ప్రమాదం ► అవి ఉంటే మురికివాడలుగా కనిపిస్తాయని పాలకుల భావన ► ఎత్తు పెంపు ప్రణాళికల మాటున ఇక్కడినుంచి ఎత్తివేసే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రతిపాదిత రాజధానిలో పల్లెలు గల్లంతుకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు, మంత్రుల ప్రకటనలు ఇందుకు అనుగుణంగానే ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. సీడ్ కేపిటల్ (తొలిదశ) నిర్మాణాలకు నాలుగు గ్రామాల ఎంపిక, విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యాల ఏర్పాటుకు భారీ ప్రణాళికలు, ముంపు ప్రమాదం లేకుండా సముద్ర మట్టానికి అనుగుణంగా గ్రామాల ఎత్తు పెంపు వంటి ఆలోచనలు పల్లెల ఎత్తివేతకేనంటున్నారు. వారందరికీ బహుళ అంతస్తుల భవనాల్లో నివాసం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న నవ్యాంధ్ర రాజధానిలోనే పల్లెలు కొనసాగితే అవన్నీ మురికివాడలుగా కనిపించే అవకాశం ఉంది. ఇదే అభిప్రాయంలో ప్రభుత్వం ఉండటంతో వీటిని తొలగించే అవకాశాలే ఎక్కువంటున్నారు. మొదటి నుంచి రాజధానిలోని 29 గ్రామాలను తొలగించేది లేదని, అవన్నీ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు, మంత్రులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీనికి విరుద్ధంగా తొలిగా సీడ్ క్యాపిటల్‌కు నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. భూ సమీకరణకు మొదటి నుంచి సానుకూలంగా స్పందించిన ఈ గ్రామాల్లోనే రాజధానికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాలు చేపట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ గ్రామాలు కనుమరుగుకాక తప్పదు. విశాలమైన రోడ్లకు ప్రణాళిక రాజధానికి విశాలమైన రహదారులు, భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యాలు, ముంపు బెడద నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం రహదారుల వెడల్పు 20 అడుగులకు మించి లేదు. నవ్యాంధ్ర రాజధానికి నాలుగు సమాంతర రహదారుల నిర్మాణాలకు అంచనాలు రూపొందుతున్నాయి. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు ఇప్పటికే రాజధాని వరకు రవాణా సౌకర్యం మెరుగుకు 100 అడుగుల నిడివి కలిగిన రహదారుల విస్తరణకు అంచనాలు రూపొందించాయి. వీటికి అనుగుణంగా రహదారుల విస్తరణ జరిపితే అనేక భవనాలను నేలకూల్చక తప్పదు. గ్రామాల స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణం? కొండవీటి వాగు ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు సముద్ర మట్టానికి అనుగుణంగా రాజధాని గ్రామాల ఎత్తు పెంచుతామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో ఈ గ్రామాలను పూర్తిగా ఎత్తివేసి, అక్కడ నిర్మించనున్న బహుళ అంతస్తుల్లో వారికి నివాసం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జోన్ల వారీగా అభివృద్ధి జరుగుతుందని, గ్రామ కంఠాల పరిధి పెరగదనే ప్రకటనలతో రాజధాని గ్రామాల ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. పొంతనలేని ప్రకటనలకు రాజధాని గ్రామాల ప్రజలు కలత చెందుతున్నారు. పాలకుల మైండ్ గేమ్‌కు తట్టుకోలేక ఏదో ఒక రోజు రాజధాని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా అక్కడి నుంచి తరలివెళ్లే అవకాశాలు లేకపోలేదు. వీటికితోడు సీఆర్డీఏ ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో పారిశ్రామిక, నివాస ప్రాంతాలు, రోడ్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. రాజధాని నగరం 212 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ పరిధిలో నిర్మాణాలకుతోడు మురుగునీరు, వరదనీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. వీటిల్లో అనేక ప్రాజెక్టులు రాజధాని గ్రామాల నుంచి కొనసాగుతాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే రాజధాని గ్రామాల్లోని అనేక నివాసాలను తీసివేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తొలగించి, మరి కొన్నింటిని కొనసాగించే కంటే మొత్తం గ్రామాలనే తొలగించాలని, లేకుంటే అవన్నీ మురికి వాడలుగా కనిపిస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఒక సమయంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ రాజధాని నిర్మాణం జరిగితే ఆ పరిసరాల్లోని రాజధాని గ్రామాలు మురికివాడలుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వ చర్యలు ఉండటంతో రాజధాని గ్రామాల మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఆ పని సింగపూర్ ప్రభుత్వం చేపట్టదు
- రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుపై సింగపూర్ మంత్రి స్పష్టీకరణ - మా కంపెనీలు ఆ పని చేస్తాయి - వాటిని పురమాయించడమే మా ప్రభుత్వ విధి - పత్యేక దూతగా గోపీనాథ్ పిళ్లై నియామకం - జూన్‌కల్లా తొలిదశ మాస్టర్‌ప్లాన్ సిద్ధం - చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడిన షణ్ముగం సాక్షి, హైదరాబాద్: రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును తమ ప్రభుత్వం నేరుగా చేపట్టడం లేదని సింగపూర్ విదేశీ వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రి కె.షణ్ముగం స్పష్టం చేశారు. కేవలం తమ దేశానికి చెందిన వివిధ కంపెనీలను, ఏజెన్సీలను పురమాయించడానికే పరిమతవుతుందని తెలిపారు. ప్రాజెక్టును చేపట్టడం తమ ప్రభుత్వం పని కాదని తేల్చిచెప్పారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, సింగపూర్ దూత గోపీనాథ్ పిళ్లైలతో కలిసి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమగ్ర ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల అభివృద్ధి చేసిన తర్వాత పలు సమస్యలు వస్తాయని, పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళితే సమస్యలు రావని చెప్పారు. నిజంగా ప్రపంచస్థాయి నగరం నిర్మించాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమని, ఈ ప్లాన్ రూపకల్పనలో తమ అనుభవం, నైపుణ్యం ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తొలి దశ మాస్టర్‌ప్లాన్ జూన్ కల్లా సిద్ధం చేస్తామని చెప్పారు. తర్వాత.. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఏపీ, సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లో మెరుగైన సమన్వయం కోసం తమ రాయబారి గోపీనాథ్ పిళ్లైని ఏపీకి ప్రత్యేక దూతగా నియమిస్తున్నామని చెప్పారు. ‘ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఏదైనా ఒప్పందం ఉందా? రాజధాని నగరాలను అభివృద్ధి చేసే సామర్థ్యం సింగపూర్‌కు ఉందా? అలాంటి అనుభవం సింగపూర్ ప్రభుత్వానికి ఉందా?’ అని సింగపూర్ మంత్రిని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమాధానం ఇచ్చారు. ‘సింగపూర్ ప్రపంచస్థాయి నగరం. మన తర్వాతే స్వాతంత్య్రం వచ్చినా.. అభివృద్ధిలో మనకంటే చాలా ముందున్నారు. పట్టణాభివృద్ధి రంగంలో వారికి అనుభవం, నైపుణ్యం ఉంది..’ అని చెప్పారు. జర్నలిస్టులూ మా దేశానికి రండి: షణ్ముగం ‘జర్నలిస్టులూ మా దేశానికి వచ్చి చూడండి. ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ను సందర్శించండి. అక్కడున్న ఆలోచనలను గమనించండి. సింగపూర్ ఆలోచనలన్నీ తప్పకుండా ఫలితాన్నిస్తాయని చెప్పడం లేదు. ప్రపంచంలోని ఉత్తమ ఆలోచనలను తీసుకొని సింగపూర్‌లో అమలు చేశాం. అదే మమ్మల్ని అభివృద్ధిలో ముందు నిలిపింది’ అని షణ్ముగం ఆహ్వానించారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు 25 వేల ఎకరాలు సేకరించామని సీఎం చెప్పారు. వచ్చే రెండురోజుల్లో మరో 10-15 వేల ఎకరాలు సేకరిస్తామన్నారు. ప్రధాన నగర నిర్మాణానికి మొత్తం 50 వేల ఎకరాలు సేకరించనున్నామని చెప్పారు. -
రాజధాని నిర్మాణంతో జిల్లా అభివృద్ధి బాట - ఎంపీ రాయపాటి
నరసరావుపేట వెస్ట్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోనే రాజధాని నిర్మాణం అధికంగా ఉంటుందని, పరిపాలన భవనం కూడా జిల్లా పరిధిలోనే ఉంటుందని చెప్పారు. నరసరావుపేటలో బుధవారం రాత్రి జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాల సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజధాని కోసం తాడికొండ-తుళ్ళూరుల మధ్య 22వేలు ఎకరాలు సేకరిస్తున్నారన్నారు. నరసరావుపేట పట్టణంలోని రెండవ రైల్వేగేటు వద్ద ప్రతిపాదించిన అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం, జేఎన్టీయు ఇంజినీరింగ్ కళాశాలను వచ్చే ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని, నరసరావుపేట-గుంటూరుల మధ్య షటిల్ సర్వీసు రైలును బడ్జెట్లో పెట్టిస్తామని చెప్పారు. గుంటూరు-గుంతకల్ మధ్యన రైల్వే విద్యుద్దీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.అనంతరం కబడ్డీ విజేతలకు షీల్టులు బహూకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, సాయి తిరుమల ఇంజినీరంగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నలబోతు వెంకటరావు, ఏఎన్‌యూ కబడ్డీ కో ఆర్డినేటర్ సూరినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాసేపట్లో AP రాజధాని సలహా కమిటీ భేటీ